Homeఎంటర్టైన్మెంట్Actor Suresh Son: నటుడు సురేష్ కొడుకును ఎపుడైనా చూశారా..? ఎట్టకేలకు అజ్ఞాతం నుండి బయటకు,...

Actor Suresh Son: నటుడు సురేష్ కొడుకును ఎపుడైనా చూశారా..? ఎట్టకేలకు అజ్ఞాతం నుండి బయటకు, వైరల్ ఫోటో

Actor Suresh Son: కెరీర్లో 270కి పైగా చిత్రాల్లో సురేష్ నటించారు. కాగా సురేష్ 1990లో అనిత రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. 1995లో ఆమెకు విడాకులు ఇచ్చారు. వీరికి ఒక అబ్బాయి ఉన్నాడు. అతడి పేరు నిఖిల్ సురేష్. కొడుకు నిఖిల్ తో సురేష్ దిగిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది. దాంతో సురేష్ కి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా?

Actor Suresh Son: నటుడు సురేష్ గురించి ఈ తరానికి తెలియక పోవచ్చు. కానీ 80లలో అతడు తెలుగు, తమిళ భాషల్లో స్టార్ గా హవా సాగించాడు. ఏడాదికి 10 నుండి 20 చిత్రాల్లో నటించేవాడు. పుట్టింటి పట్టుచీర, అమ్మోరు వంటి హిట్ చిత్రాల్లో ఆయన నటించారు. విలక్షణ పాత్రలు చేశారు. హీరోగా కెరీర్ మొదలుపెట్టిన సురేష్.. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ కూడా చేశారు. గత ఏడాది విడుదలైన జిన్నా మూవీలో సురేష్ ఓ పాత్ర చేశారు. మంచు విష్ణు, పాయల్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలు చేశారు.

కెరీర్లో 270కి పైగా చిత్రాల్లో సురేష్ నటించారు. కాగా సురేష్ 1990లో అనిత రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. 1995లో ఆమెకు విడాకులు ఇచ్చారు. వీరికి ఒక అబ్బాయి ఉన్నాడు. అతడి పేరు నిఖిల్ సురేష్. కొడుకు నిఖిల్ తో సురేష్ దిగిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది. దాంతో సురేష్ కి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

అనిత రెడ్డి కూడా చిత్ర పరిశ్రమలో ఉండేవారట. ఆమెకు బాగా చదువుకుని అమెరికాలో సెటిల్ అవ్వాలనేది కోరిక అట. తనతో పాటు అమెరికా వచ్చేయాలని సురేష్ ని ఆమె కోరిందట. నటుడిగా బిజీగా ఉన్న సురేష్ అందుకు ఒప్పుకోలేదట. దాంతో విడాకులు తీసుకున్నారట. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. తనకు అమెరికాలో సెటిల్ అవ్వాలనే కల ఉంది. సినిమా వదిలేసి నేను అమెరికా వెళ్ళలేను. అందుకే పరస్పర అవగాహనతో విడాకులు తీసుకున్నామని సురేష్ గతంలో పలు ఇంటర్వ్యూలలో వెల్లడించాడు.

సురేష్ రెండో పెళ్లి చేసుకోగా… అనిత కూడా మరో వివాహం చేసుకుంది. అనిత రెండో భర్త చాలా మంచివాడట. సురేష్ ఎప్పుడు అమెరికా వెళ్లినా మాజీ భార్య ఇంట్లోనే ఉంటాడట. అలాగే ఇండియా తన మాజీ భార్య కుటుంబం వస్తే తన వద్ద ఉంటారట. భార్యా భర్తలుగా విడిపోయినా.. మా మధ్య స్నేహం అలానే ఉందని సురేష్ అంటారు. విడిపోయినప్పుడు ఉన్న ఆస్తి చెరో సగం పంచుకున్నారట. సురేష్ తన కొడుకు నిఖిల్ తో దిగిన ఫోటో వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Suresh Naidu (@sureshtheactor)

Related News

Most Popular

Oktelugu Epaper