Homeఎంటర్టైన్మెంట్Varun Tej And Naga Babu: తండ్రి కొడుకులుగా నటించబోతున్న నాగ బాబు , వరుణ్...

Varun Tej And Naga Babu: తండ్రి కొడుకులుగా నటించబోతున్న నాగ బాబు , వరుణ్ తేజ్.. డైరెక్టర్ ఎవరంటే..

Varun Tej And Naga Babu: మెగా ఫ్యామిలీ లో స్టార్ హీరో అయ్యే లక్షణాలన్నీ ఉన్న హీరో వరుణ్ తేజ్. కమర్షియల్ ఫార్మటు సినిమాలు చేస్తూ వెళ్లుంటే , ఈరోజు వరుణ్ తేజ్ రేంజ్ ఎక్కడో ఉండేది. కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా ఉన్నాయి. కానీ ఆయన కరోనా లాక్ డౌన్ తర్వాత ఎక్కువగా ప్రయోగాలు చేయడం తో చేతులు కాల్చుకోవాల్సి వచ్చింది. వరుసగా డిజాస్టర్స్ రావడం తో ఇకపై ప్రయోగాల […]

Varun Tej And Naga Babu: మెగా ఫ్యామిలీ లో స్టార్ హీరో అయ్యే లక్షణాలన్నీ ఉన్న హీరో వరుణ్ తేజ్. కమర్షియల్ ఫార్మటు సినిమాలు చేస్తూ వెళ్లుంటే , ఈరోజు వరుణ్ తేజ్ రేంజ్ ఎక్కడో ఉండేది. కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా ఉన్నాయి. కానీ ఆయన కరోనా లాక్ డౌన్ తర్వాత ఎక్కువగా ప్రయోగాలు చేయడం తో చేతులు కాల్చుకోవాల్సి వచ్చింది. వరుసగా డిజాస్టర్స్ రావడం తో ఇకపై ప్రయోగాల జోలికి పోకూడదని నిర్ణయించుకున్నాడు వరుణ్ తేజ్. అందులో భాగంగానే ఆయన చేసిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. కొత్త రకం కాన్సెప్ట్ కి కమెర్షియాలిటీ ని జోడించి తెరకెక్కించిన ఈ చితం , రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. నేడు రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ పడనుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ , ట్రైలర్ లకు కూడా ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి బంపర్ రెస్పాన్స్ వచ్చింది.

ప్రొమోషన్స్ లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు వరుణ్ తేజ్. అందులో భాగంగా ఆయన అభిమానులతో రీసెంట్ గానే చేసిన ఒక ఇంటరాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే తాను తన తండ్రి నాగబాబు తో కలిసి ‘బరి’ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నానని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్. ఈ చిత్రం లో నాగబాబు ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడట. అది తండ్రి పాత్ర నే అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. మరో పక్క చిత్రానికి నాగబాబు కూతురు నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించబోతుంది. ఈ సినిమా లో వరుణ్ తేజ్ వాలీ బాల్ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. నిహారిక నిర్మాతగా వ్యవహరించిన మొదటి చిత్రం ‘కమిటీ కుర్రాళ్ళు’ కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.

ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ‘యాదు’, ‘బరి’ కి కూడా దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ వాలీ బాల్ ప్రాక్టీస్ చేస్తూ , తన కాళ్లకు తీవ్రమైన గాయాలను తగిలించుకున్నాడు. ప్రస్తుతం నాలుగు నెలల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నాలుగు నెలల తర్వాత షూటింగ్ ప్రారంభం కానుంది. వరుణ్ తేజ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ , ఇప్పటి వరకు ఆయన తన తండ్రి నాగబాబు తో కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అలాంటిది ఈ సినిమా తో ఆయన తన తండ్రి తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండడం స్పెషల్ అనే చెప్పాలి. ఈ చిత్రానికి నిర్మాత నిహారిక నే కాబట్టి , ఆమె కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper