Varun Tej health update : ప్రముఖ యంగ్ హీరో వరుణ్ తేజ్(Varun Tej) కి చిన్నపాటి ప్రమాదం జరిగిందని, దీంతో అత్యవసరంగా ఆయన్ని హాస్పిటల్ కి తరలించి సర్జరీ చేయించారనే వార్త , మెగా అభిమానులను కాస్త కంగారుకి గురి చేసింది. కొన్ని మీడియా చానెల్స్ అయితే వరుణ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి పై రకరకాల కథనాలు రాస్తూ అభిమానులను భయాందోళనకు గురి చేశారు. ఇదంతా గమనించిన వరుణ్ తేజ్ సోదరి నిహారిక కొణిదెల , కాసేపటి క్రితమే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో వరుణ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి పై వేసిన ఒక పోస్టు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ ‘రీసెంట్ గానే నా అన్నయ్య వరుణ్ తేజ్ మోకాళ్ళకు దెబ్బ తగిలిందని అభిమానులు కంగారుకి గురి అయ్యారు. సోషల్ మీడియా లో నన్ను ట్యాగ్ చేసి వరుణ్ ఆరోగ్య పరిస్థితి పై ఆరాలు తీశారు ‘.
‘ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మీ అందరికీ ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. నేను నిర్మాతగా తెరకెక్కిస్తున్న ‘బరి’ షూటింగ్ లో అన్నయ్య హీరో గా నటిస్తున్నాడు. వాలీ బాల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి, అన్నయ్య వాలీ బాల్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆయన మోకాళ్ళు ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో ఆయన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి సర్జరీ చేయించాము. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణ లో ఉన్నాడు, కోలుకుంటున్నాడు. త్వరలోనే అన్నయ్య పూర్తి స్థాయి ఆరోగ్యం తో మన ముందుకొస్తాడు. ఈ సందర్భంగా మీరందరు మాపై చూపించిన ప్రేమ కి, సపోర్టు కి ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చింది నిహారిక కొణిదెల. ఆమె పెట్టిన ఈ పోస్ట్ తో మెగా అభిమానులు కాస్త శాంతించారు. అయితే సర్జరీ జరిగే రేంజ్ లో సినిమా కోసం ప్రాక్టీస్ చేశాడంటే, వరుణ్ తేజ్ ఈ చిత్రాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.
‘కమిటీ కుర్రాళ్ళు’ వంటి భారీ హిట్ ని ప్రేక్షకులకు అందించిన యాదు వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు జరగడం , అందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేయడం మనమంతా చూశాము. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పటికే నిర్మాతగా ‘కమిటీ కుర్రాళ్ళు’, ‘రాకాస’ వంటి వరుస హిట్స్ తో నిర్మాతగా స్థిరపడిన నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్స్ నుండి వస్తున్న సినిమా కావడంతో , ఈ చిత్రం పై మెగా ఫ్యాన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా రేంజ్ ఎలా ఉండబోతుందో చూడాలి.
