Varun Tej and Lavanya : మెగా కుటుంబం లో కొత్త సభ్యుడు అతి త్వరలోనే రాబోతున్నాడు. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్(Varun Tej) 2023 వ సంవత్సరం లో ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీళ్లిద్దరు త్వరలోనే ఒక బిడ్డకు జన్మని ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. లావణ్య త్రిపాఠి గర్భం దాల్చిందని, మెగా కుటుంబం మొత్తం ఈ విషయాన్ని విని సంబరాలు చేసుకుంటున్నారని అంటున్నారు. నాగబాబు కుటుంబానికి ఈమధ్య కాలం లో అన్ని చాలా బాగా కలిసి వస్తున్నాయి. కూతురు నిహారిక కొణిదెల ‘కమిటీ కుర్రాళ్ళు’ సక్సెస్ తో నిర్మాతగా కెరీర్ లో సక్సెస్ అయ్యింది. ఇక నాగబాబు కి అయితే రీసెంట్ గానే MLC పదవి వచ్చింది. త్వరలోనే ఆయన మంత్రి పదవి కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇలా వరుస శుభపరిణామాల తర్వాత ఇప్పుడు వరుణ్ తేజ్, లావణ్య లు తల్లితండ్రులు కాబోతుండడం ఆ కుటుంబానికి ఎంత సంతోషాన్ని ఇచ్చిందో ఊహించుకోవచ్చు.
Also Read : కొత్త ఇంట్లోకి వెళ్లిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి..ఆ ఇల్లు ఎవరిదో తెలుసా..?
పెళ్లి తర్వాత పిల్లల్ని కనేందుకు హీరోయిన్స్ పెద్దగా ఆసక్తి చూపించరు. ఎందుకంటే అందం తరిగిపోతుంది, సినిమా అవకాశాలు రావు అనే భయం ఉంటుంది కాబట్టి. కానీ లావణ్య త్రిపాఠి కోరుకుంటే బంగారం లాంటి కెరీర్ ఆమె ముందు ఉంటుంది. ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఆమె హీరోయిన్ కాగలదు. అయినప్పటికీ కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇలాంటి అమ్మయిలు ఇండస్ట్రీ లో ఎంతమంది ఉంటారు చెప్పండి. పెళ్లి తర్వాత సినిమాలు చేయడానికి ఒప్పుకుంది, కానీ తోటి హీరోయిన్స్ లాగా చేతికి అందిన పాత్రలు చేయడం లేదు, కేవలం సంసారపక్షంగా, నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఆమె చేసేందుకు మొగ్గు చూపిస్తుంది. ఈ కాలం లో ఇంత విలువలతో నడుచుకునే అమ్మాయి దొరకడం, నిజంగా వరుణ్ తేజ్ అదృష్టం అని చెప్పొచ్చు.
వ్యక్తిగంగా ఎన్నో శుభపరిణామాలను చూస్తున్న వరుణ్ తేజ్, వృత్తి పరంగా మాత్రం వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకుంటున్నాడు. F3 తర్వాత వరుణ్ తేజ్ చేసిన గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా వంటి చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. F3 కి ముందు ఆయన చేసిన గని అనే చిత్రం కూడా దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. సోలో హీరో గా వరుణ్ తేజ్ సూపర్ హిట్ ని అందుకొని దాదాపుగా ఆరేళ్ళు కావొస్తుంది. ‘గద్దలకొండ గణేష్’ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. రాబోయే రోజుల్లో అయినా సరైన సినిమా తీసి బ్లాక్ బస్టర్ ని అందుకొని మళ్ళీ కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వీటిలో ఒక చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. మరో చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో తెరకెక్కుతుంది.
Also Read : వరుణ్ తేజ్-లావణ్యలకు షేకింగ్ పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్.. బిగ్ సర్ప్రైజ్ ఫొటోలు వైరల్