Homeఆంధ్రప్రదేశ్‌Naga Babu Slams YSRCP: వైసీపీని వదలని మెగా బ్రదర్!

Naga Babu Slams YSRCP: వైసీపీని వదలని మెగా బ్రదర్!

Naga Babu Slams YSRCP: మెగా బ్రదర్ నాగబాబు( Mega brother Naga babu ) మరో వీడియో విడుదల చేశారు. మొన్ననే జనసేన సమావేశంలో ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ నుంచి వస్తున్న విమర్శలను తిప్పి కొట్టడంలో జనసైనికులు ఫెయిలవుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు పై సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం నడిచింది. దీంతో వరుసగా నాగబాబు […]

Naga Babu Slams YSRCP: మెగా బ్రదర్ నాగబాబు( Mega brother Naga babu ) మరో వీడియో విడుదల చేశారు. మొన్ననే జనసేన సమావేశంలో ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ నుంచి వస్తున్న విమర్శలను తిప్పి కొట్టడంలో జనసైనికులు ఫెయిలవుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు పై సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం నడిచింది. దీంతో వరుసగా నాగబాబు వీడియోలు విడుదల చేస్తుండడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మొన్ననే ఒక వీడియో విడుదల చేసిన నాగబాబు తాజాగా మరో వీడియో విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహి అంటూ వ్యాఖ్యానించారు. నాగబాబు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వరుస వీడియోలతో..
మొన్ననే ఒక వీడియో విడుదల చేసిన నాగబాబు వరుసగా వీడియోలు ఉంటాయని సంకేతాలు ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే చేస్తున్నారు. పూర్వం మంత్రాలకు చింతకాయలు రాళ్లుతాయని.. సిద్ధులు నీటితోనే దీపాలు వెలిగించారని చెబితే నమ్మే వాళ్ళం కాదని.. కానీ మన జగన్ బాబా మాత్రం పాలు, నెయ్యి లేకుండానే తిరుమల( Tirumala) లడ్డూను తయారు చేశారని సెటైర్ వేశారు. దొంగ బాబాగామారి వైసిపి హయాంలో టీటీడీ చైర్మన్ చుక్క పాలు, నెయ్యి కానీ లేకుండా ప్రమాదకరమైన కెమికల్స్ తో లడ్డును తయారు చేశారని ఆరోపించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏడాదిన్నర పాటు విచారించి నిజాలు బయటపెట్టిందన్నారు. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బుకాయింపు దారుణమని వ్యాఖ్యానించారు.
నేరుగా టార్గెట్..
నాగబాబు నేరుగా అప్పటి టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పై( Y v Subba Reddy ) విమర్శలు చేశారు. నిబంధనలు మార్చి అనర్హులకు నెయ్యి టెండర్లు ఖరారు చేశారని చెప్పుకొచ్చారు. దొంగ డైరీలతో నమోదైన కంపెనీ నుంచి సేకరించిన కెమికల్స్ తో కూడిన నెయ్యి కానీ నూనెతో లడ్డు తయారయిందని ఆందోళన వ్యక్తం చేశారు నాగబాబు. అయితే వరుస వీడియోలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతున్నారు నాగబాబు. మరి తదుపరి వీడియో ఎలా ఉంటుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper