Spider Man Brand New Day: ఈ ఏడాది మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం ‘పెద్ది’. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , బుచ్చి బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో ఈ చిత్రానికి భారీ స్థాయిలో వసూళ్లు వచ్చాయి కానీ, ఓపెనింగ్స్ మాత్రం అంచనాలకు తగ్గట్టుగా రాలేదు అనే చెప్పాలి. ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండి క్లోజింగ్ వరకు నిరాశకు గురి చేసే వసూళ్లే వచ్చాయి. ఇకపోతే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి విడుదలకు ముందు ప్రీమియర్స్ + మొదటి రోజు కి కలిపి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 53 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చిన సంగతి తెల్సిందే.
ఈ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ని హాలీవుడ్ కి చెందిన ‘స్పైడర్ మ్యాన్ : బ్రాండ్ న్యూ డే ‘ మూవీ బద్దలు కొట్టడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 60 కోట్ల రూపాయిల వరకు జరిగిందని అంటున్నారు. అంతే కాకుండా బుక్ మై షో యాప్ లో కూడా ఈ చిత్రానికి ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ఇండియన్ సినిమాల కంటే ఎక్కువ టికెట్స్ అమ్ముడుపోయాయట. ఈ చిత్రానికి నిన్న రాత్రి బుక్ మై షో యాప్ లో గంటకు 50 వేల టికెట్స్ అమ్ముడుపోయాయట. ప్రస్తుతానికి గంటకు 44 వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయి. సాయంత్రం సమయానికి గంటకు 60 వేల టికెట్లు అమ్ముడుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు.
అంతే కాదు ఈ చిత్రానికి వీకెండ్ వరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 200 కోట్ల రూపాయిల రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయట. ఇప్పటి వరకు ‘ఎవెంజర్స్ ఎండ్ గేమ్’ చిత్రానికి తప్ప , మరో హాలీవుడ్ చిత్రానికి ఈ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. టాక్ కూడా చాలా పాజిటివ్ గా రావడం తో , ఈ ఏడాది ‘ధురంధర్ : ది రివెంజ్’ తర్వాత అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం నిలిచిపోతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి ఆ రేంజ్ కి వెళ్తుందో లేదో చూడాలి. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఈ చిత్రానికి డబుల్ డిజిట్ ఓపెనింగ్ రానుంది అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఈ సినిమాకు ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది.