Anil Ravipudi: మన టాలీవుడ్ లో వేగంగా సినిమాలు తీసి , భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని, వందల కోట్ల గ్రాస్ ని బాక్స్ ఆఫీస్ వద్ద కొల్లగొట్టే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది అనిల్ రావిపూడి మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 100 రోజుల లోపే షూటింగ్ ని పూర్తి చేయడం ఈయన ప్రత్యేకత. రీసెంట్ గా ‘లెనిన్’ మూవీ సక్సెస్ మీట్ లో , సినిమాలను అనుకున్న నిర్దిష్ట సమయానికి ఎందుకు పూర్తి చేయలేకపోయాము అంటూ నాగార్జున తీవ్రమైన అసహనం వ్యక్తం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన మాటలని బట్టీ చూస్తుంటే అనిల్ రావిపూడి వంటి వారు మన టాలీవుడ్ కి దొరకడం అదృష్టం అనే చెప్పాలి. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి 300 కోట్ల గ్రాస్ ని అందుకున్న అనిల్ రావిపూడి , ఈ ఏడాది ‘మన శంకర వరప్రసాద్ గారు’ తో మరోసారి 300 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టి సెన్సేషన్ సృష్టించారు అనిల్ రావిపూడి.
ఇప్పుడు మరోసారి ఆయన విక్టరీ వెంకటేష్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వెంకటేష్ , కళ్యాణ్ రామ్ లతో తీస్తున్న మల్టీస్టార్రర్ చిత్రం షూటింగ్ జెట్ స్పీడ్ తో ముందుకు దూసుకుపోతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని తీసుకొని రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ నెలాఖరు లోపు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అవుతాయట. ఇదంతా పక్కన పెడితే , ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి చేయబోయే 4 సినిమాలు కూడా లాక్ అయిపోయాయి అట. KVN ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఇప్పటికే ఒక యానిమేషన్ చిత్రాన్ని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట అనిల్ రావిపూడి.
ఇక ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. ఈ చిత్రం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అదే విధంగా సాహు గారపాటి తో ఒక సినిమా, పెద్ది నిర్మాత సతీష్ కిలారి తో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారట అనిల్ రావిపూడి. ఇందులో ఒక ప్రాజెక్ట్ లో అక్కినేని నాగార్జున హీరో గా నటించే అవకాశం ఉండగా , మరో ప్రాజెక్ట్ లో నందమూరి బాలకృష్ణ హీరో గా నటించే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.