Spider Man Brand New Day: ‘స్పైడర్ మ్యాన్’.. ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ ని సృష్టించిన సూపర్ హీరో. పిల్లలు అమితంగా ప్రేమించే క్యారెక్టర్, మార్వెల్ స్టూడియోస్ సంస్థ ని ఇంటర్నేషనల్ సంస్థ గా తీర్చి దిద్దిన క్యారెక్టర్. ఈ సూపర్ హీరో నుండే చిన్నగా ఎవెంజర్స్ కూడా పుట్టుకొచ్చారు. నేడు అది అతి పెద్ద యూనివర్స్ గా మారిపోయింది. ఇకపోతే ‘స్పైడర్ మ్యాన్’ అంటే మన ఇండియన్స్ కి కూడా పిచ్చి. ఈ ఫ్రాంచైజ్ నుండి వచ్చిన ప్రతీ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు పుట్టించాయి. ఈ సిరీస్ నుండి రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ‘స్పైడర్ మ్యాన్ : బ్రాండ్ న్యూ డే’ అనే చిత్రం విడుదల కాబోతుంది. విదేశాల్లో కంటే ముందుగా మన ఇండియా లోనే ఈ చిత్రం ప్రీమియర్ షోస్ పడనుంది.
అయితే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ‘ది ఒడిస్సీ’ గ్రాస్ ని కూడా దాటేసింది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ముఖ్యంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి నిన్నటి వరకు 41 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా నమోదు అయ్యాయి అట. ఒక్క హైదరాబాద్ సిటీ నుండే ఈ చిత్రానికి 1 లక్ష టికెట్లు ఇప్పటి వరకు అమ్ముడుపోయాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉంది అనేది. బాషలవారీగా మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద బుకింగ్స్ ద్వారా ఈ చిత్రానికి నమోదైన గ్రాస్ వసూళ్లను ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పటి వరకు ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి అన్ని భాషలకు కలిపి 16,880 షోస్ ని షెడ్యూల్ చేశారు. ఈ షోస్ ద్వారా ఇంగ్లీష్ భాష నుండి 27 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వగా, హిందీ భాష నుండి 10 కోట్ల 38 లక్షలు, తెలుగు భాష నుండి 1 కోటి 96 లక్షలు , తమిళ భాష నుండి 1 కోటి 89 లక్షలు, ఇతర బాషల నుండి 3 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి.
అంటే మన ఇండియన్స్ లో అత్యధిక శాతం మంది తమ మాతృ భాషల్లో ఈ సినిమాని చూడడం కంటే , ఇంగ్లీష్ బాషలోనే చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అన్నమాట. ఒక్క హైదరాబాద్ సిటీ నుండే ఈ చిత్రానికి ఇప్పటి వరకు 3 కోట్ల 18 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. అందులో అత్యధిక శాతం గ్రాస్ ఇంగ్లీష్ నుండే రావడం గమనార్హం. ఇక నార్త్ అమెరికా మరియు ఇతర పశ్చిమ దేశాల నుండి నమోదైన వసూళ్లు లెక్క నిన్నటి వరకు 240 మిలియన్ డాలర్లు అట. అందులో కేవలం నార్త్ అమెరికా నుండి ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చిన గ్రాస్ 100 మిలియన్ డాలర్లు అని అంటున్నారు. ఈరోజు సాయంత్రం బుకింగ్స్ ముగిసేలోపు ఈ చిత్రానికి 300 మిలియన్ డాలర్ల గ్రాస్ నమోదు అవుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.