Rajendra Prasad Remuneration: తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో తిరుగులేని లెజెండ్స్ లో పిలవబడే హీరోలు కొంతమంది ఉంటారు, అలాంటి మహానటులు మన ఇండస్ట్రీ లో ఉండడం తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం. అలాంటి లెజండరీ హీరోల్లో ఒకరు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. దాదాపుగా రెండు దశాబ్దాల పాటు కామెడీ హీరో గా తిరుగులేని స్టార్ స్టేటస్ తో ఇండస్ట్రీ లో చక్రం తిప్పిన రాజేంద్ర ప్రసాద్, వయస్సు వచ్చాక సపోర్టింగ్ రోల్స్ తో నేటి తరం ఆడియన్స్ కి కూడా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. అయితే ఇండస్ట్రీ లో ఈ స్థాయికి చేరుకున్న రాజేంద్ర ప్రసాద్ , తన స్థాయికి తగ్గ రెమ్యూనరేషన్స్ డిమాండ్ చేస్తే వందల కోట్ల ఆస్తులు ఇప్పుడు ఆయనకు ఉండేవి. కానీ ఆయన రెమ్యూనరేషన్ కి సంబంధించిన వివరాలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది.
రాజేంద్ర ప్రసాద్ హీరో గా సూపర్ స్టార్ స్టేటస్ తో కొనసాగుతున్న రోజుల్లో నాకు కచ్చితంగా ఇంత రెమ్యూనరేషన్ కావాలంటూ డిమాండ్ చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదట. నిర్మాత ఎంత ఇస్తే అంతే తీసుకునేవాడట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే , ఆరోజుల్లో తాను ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకునేవాడో తనకే తెలియదట. ఆయన రెమ్యూనరేషన్స్ మొత్తాన్ని మేనల్లుడు చూసుకునేవాడట. స్టార్ స్టేటస్ తో కొనసాగుతున్న రోజుల్లో నాకు పలానా రెమ్యూనరేషన్ కావాలి అని అడగడానికి రాజేంద్ర ప్రసాద్ కి ధైర్యం సరిపోయేది కాదట , ఎందుకంటే మనం అడిగిన రెమ్యూనరేషన్ వాళ్ళు ఎక్కువ అని ఫీల్ అయ్యారనుకో , పాత్ర మిస్ అయిపొతుందెమో అనే భయం ఉండేదట. అందుకే తాను రెమ్యూనరేషన్ గురించి పట్టించుకునేవాడిని కాదని , కానీ ఏ నిర్మాత కూడా నాకు డబ్బులు ఎగ్గొట్టిన సందర్భాలు లేవని రాజేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
గట్టిగా చెప్పాలంటే రాజేంద్ర ప్రసాద్ కి సినిమాలు అవసరం లేదు , సినిమాలకే రాజేంద్ర ప్రసాద్ అవసరం. ఆయన నటన ఆ స్థాయిలో ఉంటుంది మరీ. ఎలాంటి కంటెంట్ లేని సన్నివేశాన్ని కూడా తన టాలెంట్ తో రక్తికట్టించగల దిగ్గజం ఆయన. ఆయన కోరితే ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికైనా నిర్మాతలు వెనకాడరు. అలాంటిది ఇన్నేళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానం లో నాకు ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేయకుండా ఉన్నదంటే , రాజేంద్ర ప్రసాద్ గొప్పతనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఒకటి రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వగానే మాకు రెమ్యూనరేషన్ పెంచాలి అని డిమాండ్ చేసే హీరోలు , రాజేంద్ర ప్రసాద్ నుండి చాలా నేర్చుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.