Megastar Chiranjeevi And Rajendra Prasad: ప్రముఖ సీనియర్ హీరో, కామెడీ లెజెండ్ రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) కి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ని ప్రకటించడం పై సోషల్ మీడియా లో సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులూ, నెటిజెన్స్ ప్రశంసిస్తున్నారు. చిన్న తనం నుండి రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూస్తూ పెరిగాము, ఆయన సినిమాలు ఫుల్ గా ఎంజాయ్ చేసేవాళ్ళం , ఈ వయస్సులో కూడా ఆయన అద్భుతమైన క్యారెక్టర్లు చేస్తూ టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్టులలో ఒకరిగా కొనసాగుతూ, నేటి తరం ఆడియన్స్ ని కూడా అలరిస్తున్నాడు. ఇలాంటి అదృష్టం దేవుడు అందరికీ ఇవ్వడు, అతి తక్కువ మందికి మాత్రమే ఇస్తాడు, అందులో రాజేంద్ర ప్రసాద్ కూడా ఉండడం అభినందనీయం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి రాజేంద్ర ప్రసాద్ కి పద్మశ్రీ అవార్డు ఎప్పుడో రావాల్సింది, చాలా ఆలస్యం అయ్యింది, కనీసం ఇప్పటికైనా గుర్తించారు సంతోషం అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఆయనకు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నిన్న స్వయంగా రాజేంద్ర ప్రసాద్ ఇంటికెళ్లి శుభాకాంక్షలు తెలియజేసి, ప్రత్యేకంగా సన్మానించి వచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. చిరంజీవి కి సినీ ఇండస్ట్రీ లో అత్యంత ఆప్తులు, కుటుంబ సభ్యులతో సమానమైన సెలబ్రిటీలలో ఒకరు రాజేంద్ర ప్రసాద్. కెరీర్ పరంగా అప్పట్లో వీళ్లిద్దరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోట్లాడుకునేవి. ఆరోజుల్లో చిరంజీవి సినిమా కోసం ఆడియన్స్ ఎంతలా ఎదురు చూసేవారో , రాజేంద్ర ప్రసాద్ సినిమాల కోసం కూడా అంతలా ఎదురు చూసేవారు. వీళ్లిద్దరు కలిసి రీసెంట్ గా కూడా ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం లో నటించారు. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో డాడీ, హిట్లర్, దొంగ, మంచు పల్లకి , రాక్షసుడు, పులి, ఛాలెంజ్ వంటి చిత్రాల్లో కలిసి నటించారు.
వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అత్యధిక శాతం సూపర్ హిట్స్ గా నిలిచాయి. కొన్ని కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యాయి కానీ, కాలం గడిచే కొద్దీ అవి కమర్షియల్ గా కల్ట్ క్లాసిక్ చిత్రాలుగా నిలిచాయి. మెగా ఫ్యామిలీ హీరోల్లో చిరంజీవి తర్వాత రాజేంద్ర ప్రసాద్ అత్యధిక సినిమాలు అల్లు అర్జున్ తో కలిసి చేసాడు. అదే విధంగా నేటి తరం స్టార్ హీరోలలో ఎన్టీఆర్, మహేష్ బాబు లతో కలిసి నటించాడు రాజేంద్ర ప్రసాద్. గత ఏడాది రాజేంద్ర ప్రసాద్ నుండి 5 సినిమాలు వచ్చాయి. ఎన్నడూ లేని విధంగా ఆయన తన తోటి ఆర్టిస్టులను అగౌరవపరుస్తూ మాట్లాడిన కొన్ని మాటలు తీవ్రమైన విమర్శలకు గురయ్యేలా చేశాయి. బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి రెండు మూడు సార్లు వచ్చింది. గత ఏడాది అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు చనిపోవడం తో రాజేంద్ర ప్రసాద్ కాస్త మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడని, అందుకే అలా నోరు జారే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
A celebration of contribution and commitment ❤️
Megastar @KChiruTweets garu paid a personal visit to #RajendraPrasad garu and congratulated him on receiving the Padma Award.
Moments like these truly define cinema beyond the screen #Chiranjeevi #PadmaAwards2026 pic.twitter.com/rTs1XqTvm4
— Team Megastar (@MegaStaroffl) January 26, 2026