Mahesh Babu : దర్శకధీరుడు రాజమౌళి చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో మహేష్ బాబు మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్న మహేష్ బాబు పాన్ వరల్డ్ ఇండస్ట్రీలో సైతం తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత అతనికి హాలీవుడ్ డైరెక్టర్ల నుంచి కూడా చాలా అవకాశాలు వచ్చే ఛాన్స్లైతే ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు చేయబోతున్న సినిమాల విషయంలో తను పూర్తి క్లారిటితో ఉండాల్సిన అవసరమైతే ఉంది. కానీ మహేష్ బాబు మాత్రం తన తదుపరి సినిమా ఎవరితో చేయాలనే విషయాన్ని పెద్దగా పట్టించుకోవడంలేదట. ప్రస్తుతం వారణాసి సినిమాకు సంబంధించిన పనులనే తను చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కానీ నమ్రత మాత్రం మహేష్ బాబు తదుపరి ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందనే ధోరణిలోనే కొంతవరకు కసరత్తులు చేస్తూ కొంత మంది స్టార్ డైరెక్టర్లు చెప్పే కథలను కూడా వింటుంది. ఇక ఈ క్రమంలోనే నమ్రత ఏ సినిమాకు అయితే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో మహేష్ బాబు ఆ సినిమానే చేశాడంటు కొన్ని వార్తలైతే వస్తున్నాయి…
ఇప్పటివరకు మహేష్ బాబు చేసిన సినిమాలకు సంబంధించిన కథలను నమ్రత నే వింటూ వస్తుంది కాబట్టి వారణాసి సినిమా తర్వాత కూడా ఆమె సెలెక్ట్ చేసిన కథతోనే మహేష్ బాబు సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఏదేమైనా కూడా ఆమె స్టోరీ సెలెక్షన్ అద్భుతంగా ఉంటుందని మహేష్ బాబు నమ్ముతాడు. కాబట్టి కథల విషయంలో నమ్రత పూర్తి క్లారిటి మైంటైన్ చేస్తూ ముందుకు సాగుతుంది… ఇక మహేష్ బాబు వారణాసి సినిమా పూర్తయిన తర్వాత హాలీవుడ్ డైరెక్టర్ల నుంచి అవకాశం వస్తే డైరెక్ట్ హాలీవుడ్ సినిమా చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు…
ఇక మహేష్ బాబు వారణాసి సినిమా మూవీ ఈజీగా 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ను వసూలుచేస్తుందనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి ఈ సినిమాతో మహేష్ బాబు ఓవర్ నైట్ లో పాన్ వరల్డ్ స్టార్ హీరోగా మారిపోతారనేది వాస్తవం…