Homeఎంటర్టైన్మెంట్Allu Arjun: యాంటీ ఫ్యాన్స్ పై అల్లు అర్జున్ హాట్ కామెంట్స్.. వీడియో వైరల్

Allu Arjun: యాంటీ ఫ్యాన్స్ పై అల్లు అర్జున్ హాట్ కామెంట్స్.. వీడియో వైరల్

Allu Arjun: సోషల్ మీడియా లో స్టార్ హీరోలకు అభిమానులు ఏ రేంజ్ లో ఉంటారో , యాంటీ ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటారు. వీళ్ళ అభిమానుల మధ్య జరిగే ఫ్యాన్ వార్స్ ని చూస్తే సాధారణ మూవీ లవర్ కి బీపీ రాక తప్పదు. అసభ్యకరమైన పదజాలంతో ఇష్టమొచ్చినట్టు తిట్టుకుంటూ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. అయితే స్టార్ హీరోల్లో అత్యధిక ట్రోల్స్ కి గురయ్యే హీరోల లిస్ట్ తీస్తే అందులో అల్లు […]

Allu Arjun: సోషల్ మీడియా లో స్టార్ హీరోలకు అభిమానులు ఏ రేంజ్ లో ఉంటారో , యాంటీ ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటారు. వీళ్ళ అభిమానుల మధ్య జరిగే ఫ్యాన్ వార్స్ ని చూస్తే సాధారణ మూవీ లవర్ కి బీపీ రాక తప్పదు. అసభ్యకరమైన పదజాలంతో ఇష్టమొచ్చినట్టు తిట్టుకుంటూ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. అయితే స్టార్ హీరోల్లో అత్యధిక ట్రోల్స్ కి గురయ్యే హీరోల లిస్ట్ తీస్తే అందులో అల్లు అర్జున్ మొదటి స్థానం లో ఉంటారు. ఈయనపై ఇప్పటి వరకు సోషల్ మీడియా లో వచ్చినటువంటి మార్ఫింగ్ ఫోటోలు , వీడియోలు చూస్తే ఆయన అభిమానులకు కోపం కట్టలు తెంచుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. యాంటీ ఫ్యాన్స్ తో అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా లో నిత్యం వారియర్స్ లాగా పోరాడుతూనే ఉంటారు.

అయితే నేడు అల్లు అర్జున్ ‘AAFA’ పేరుతో , అభిమానులతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం లో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా తనని ద్వేషించే వారిపై తన అభిమానులు చేస్తున్న పోరాటం గురించి ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఆయన మాట్లాడుతూ ‘ఫ్యాన్స్ , యాంటీ ఫ్యాన్స్ , హేటర్స్ అందరికీ కలిపి ఎప్పటి నుండో నేను ఒక మాట చెపుదాం అని అనుకుంటున్నాను. ఎవరైనా మీకు నచ్చలేదా?, వాళ్ళని మీరు ద్వేషించి , ట్రోల్ చేసి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. నచ్చలేదా?, వదిలేయ్.. నీ విలువైన సమయాన్ని 1 శాతం కూడా ఖర్చు చేయొద్దు. మీకు ఇష్టం లేని విషయం మీద ఎవరైనా డబ్బులు ఖర్చు చేస్తారా?, వదిలేయండి. మీకు నచ్చిన పని చేసుకోండి, మీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందుకు వెళ్లి ఆమె కోసం ఎదురు చూడు, కనీసం నువ్వైనా ఎంజాయ్ చేస్తావ్’ అంటూ చెప్పుకొచ్చారు అల్లు అర్జున్.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ మీటింగ్ కి మాకు పాసులు ఇవ్వలేదని నిరసన వ్యక్తం చేస్తూ , ఇకపై నీ గురించి పోస్టులు పెట్టబోము , నీ ఫ్యానిజం వదిలేస్తున్నాం అంటూ ట్వీట్లు వేస్తున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ తో ‘రాకా’ అనే సినిమా చేస్తున్నారు. ముంబై లో శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే విధంగా ఆయన లోకేష్ కనకరాజ్ తో చేయబోయే సినిమా ఈ ఏడాది డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.

 

View this post on Instagram

 

A post shared by Viral Updates (@viralupdatesyt)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper