Homeఅంతర్జాతీయంDia Mirza: ఈ అందగత్తె తేల్చేసింది.. భూ కాలుష్యానికి.. ఇన్ని దారుణాలకు మగాళ్లే కారణమట..

Dia Mirza: ఈ అందగత్తె తేల్చేసింది.. భూ కాలుష్యానికి.. ఇన్ని దారుణాలకు మగాళ్లే కారణమట..

Dia Mirza: భూమి మీద కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. ఒకప్పుడు విస్తారంగా ఉన్న చెట్లు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఫలితంగా మనుషులు నిండు నూరేళ్లు బతకలేకపోతున్నారు. నిండా రోగాలతో నరకం చూస్తున్నారు. చిన్న వయసులోనే ప్రాణాంతక రోగాలతో ప్రాణాలు విడుస్తున్నారు. ఇన్ని అనర్ధాలకు కారణం కాలుష్యం.

పరిశ్రమలు.. చెట్లను కొట్టివేయడం.. అడవులను ఆక్రమించడం.. నదులను మట్టితో పూడ్చివేయడం.. ఇంకా అనేక రకాల కారణాలు కాలుష్యానికి దోహదం చేస్తున్నాయి. ఇప్పటివరకు కాలుష్యం పెరడానికి కారణాలను పై వాటినే విశ్లేషించేవారు. కానీ భూమ్మీద కాలుష్యం పెరగడానికి.. ఈ స్థాయిలో అనర్ధాలు జరగడానికి కారణం కేవలం మగవాళ్లేనట. అదేంటి కేవలం మగవాళ్ళు మాత్రమే కారణమైతే.. ఆడవాళ్లు ఏం చేస్తున్నట్టు అనే ప్రశ్న మీలో వ్యక్తం అయింది కదూ..

ఈ భూమి మీద కాలుష్యం ఈ స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణం మగవాళ్ళు అని చెప్పింది ఏదో ప్రసిద్ధమైన యూనివర్సిటీ కాదు. ప్రపంచ స్థాయి వ్యక్తులు చేసిన పరిశీలన కాదు. పేరుపొందిన వ్యక్తులు రూపొందించిన నివేదిక అంతకంటే కాదు. ఈ మాట అన్నది అందగత్తె దియా మీర్జా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది. ఫెమినిజం గురించి సరికొత్తగా వ్యాఖ్యానించింది. “ఈ ప్రపంచంలో ఇప్పటివరకు తయారుచేసిన వస్తువులు.. ఉత్పత్తుల వెనుక మగవాళ్ళు ఉన్నారు. వాళ్లు మాతృ స్వామ్య వ్యవస్థకు చరమగీతం పాడారు. పితృ స్వామ్య వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చారు. ఆడవాళ్లను తొక్కేస్తున్నారు. వాళ్లకు అనుకూలంగా ఉత్పత్తులు తయారుచేసి.. ఈ భూమిని మొత్తం కాలుష్య కాసారంలాగా మార్చేసారని” దియామీర్జా వ్యాఖ్యానించింది.

కానీ ఇక్కడ ఫెమినిజం అంటే.. మగవాళ్ళను తిట్టడం కాదు.. ఆడవాళ్ళు ఎదగడం.. ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించడం.. అన్నింటికీ మించి సమాజంలో ఉన్నతంగా జీవించడం.. మగవాళ్లను కూడా అదే స్థాయిలో గౌరవించడం.. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దియా మీర్జా ఇలా మాట్లాడటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అన్నట్టు ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడిన మైక్.. ఉపయోగించిన లైట్లు.. ముఖానికి వేసుకున్న మేకప్.. జుట్టుకు వేసుకున్న డై.. ధరించిన దుస్తులు.. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సంబంధమైనవే. వీటితో పోల్చి చూస్తే మగవాళ్ళు చేసే కాలుష్యం ఎంత.. ఆడవాళ్లు మేకప్ కోసం ఉపయోగించే వస్తువులు ఎకో ఫ్రెండ్లీ కాదు కదా.. పాపం దియా మీర్జా.. మెదడులో చిప్ దొబ్బినట్టు ఉంది.. అందుకే ఇలాంటి చీప్ కామెంట్స్ చేస్తోంది..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular