
Ashu Reddy: అషురెడ్డి అంటే తెలియని సోషల్ మీడియా జనాలు ఉండరు. ఆమెకు బోల్డ్ బ్యూటీ ఇమేజ్ ఉంది. అరాకొరా బట్టల్లో అందాల ప్రదర్శన చేస్తూ వార్తలకు ఎక్కుతూ ఉంటుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె చేసే సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఫేమ్ కోసం ఎంతకైనా తెగిస్తుంది. గతంలో ప్రెగ్నెన్సీ వచ్చిందని సొంత తల్లితో ఫ్రాంక్ చేసింది. యూట్యూబ్ వ్యూస్ కోసం అషురెడ్డి చేసిన వీడియో విమర్శల పాలైంది.
ఇక పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్ ని అని చెప్పుకునే అషురెడ్డి… ఆయన ఊ అనాలే కానీ నాలుగో భార్య అవుతా అంటూ కామెంట్ చేసింది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆమెను ఏకిపారేశారు. అయితే నేను అలా అనలేదంటూ అషురెడ్డి కన్నీరు పెట్టుకుంటూ ఓ వీడియో విడుదల చేసింది. కొన్నాళ్లుగా ఇంస్టాగ్రామ్ లో అషురెడ్డి మితిమీరిన స్కిన్ షో చేస్తున్నారు. దారుణమని ఎవరైనా కామెంట్స్ చేస్తే… అషురెడ్డి సైటైర్స్ వేస్తున్నారు.

తప్పు నా బట్టల్లో లేదు. మీ కళ్ళలోనే కామం ఉందని తిట్టిపోస్తూ… అషురెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. తన డ్రెస్సింగ్ పై ఏ స్థాయిలో విమర్శలు వచ్చినా అషురెడ్డి పట్టించుకోదు. అందులోనూ ఇంస్టాగ్రామ్ ఆమెకు ఒకానొక ఆదాయమార్గంగా ఉంది. సోషల్ మీడియా ప్రమోషన్స్ తో లక్షలు సంపాదిస్తున్నారు. అషురెడ్డిని ఇంస్టాగ్రామ్ లో వన్ మిలియన్ కి పైగా ఫాలో అవుతున్నారు.
కాగా ఇంట్లో కూడా అషురెడ్డి నిండుగా బట్టలు వేసుకోరని ఆమె లేటెస్ట్ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఒంటిపై బ్రా ను తలపించే టాప్, టైట్ లోయర్ వేసుకుని అషురెడ్డి ఇంట్లో అటూ ఇటూ తిరుగుతోంది. అషురెడ్డి షేర్ చేసిన ప్రైవేట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియా సెలబ్రిటీ అయిన అషురెడ్డికి బిగ్ బాస్ షో ఫేమ్ తెచ్చింది. రామ్ గోపాల్ వర్మ అషురెడ్డితో రెండు బోల్డ్ ఇంటర్వ్యూలు చేశారు. అవి బాగా వైరల్ అయ్యాయి. అషురెడ్డి అడపాదడపా ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. అయితే బుల్లితెర మీద ఆమె సందడి తగ్గింది. సోషల్ మీడియా మాత్రం అందుబాటులో ఉంటున్నారు.