Prabhas On Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులలో చాలా మంది అభిమానులు ఉంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు వాళ్లు కూడా కొంతమంది స్టార్ హీరోలకు ఫ్యాన్స్ అయి ఉంటారు. ఇలాంటి వారిలో చాలామంది యంగ్ హీరోలు సీనియర్ హీరోలకి అభిమానులుగా మారి పోతుంటారు. అయితే ఈ జనరేషన్ లో ఉన్న చాలా మంది యంగ్ హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు అభిమానులుగా ఉంటారు.
ఎందుకంటే ఆ యంగ్ హీరోలు అందరూ కూడా వీళ్ళ సినిమాలు చూసుకుంటూ పెరిగారు కాబట్టి వాళ్లకి వీళ్ళంటే చాలా అభిమానం ఉంటుంది. ముఖ్యంగా చిరంజీవి అంటే చాలామందికి అభిమానం ఉంటుంది ఆయన సాధించిన ఘనతలు అలాంటివి…ఇక ఆయన చేసిన సినిమాల్లో ప్రతి సినిమా కూడా మినిమం గ్యారంటీగా ఉండేది. సినిమా సినిమాకి వేరియేషన్ చూపించడమే కాకుండా ప్రతి సినిమాలో వైవిధ్యమైన కథాంశాన్ని ఎంచుకోవడంలో చిరంజీవి ఎప్పుడూ సక్సెస్ అవుతూ వచ్చాడు.
అందువల్లే 40 సంవత్సరాల పాటు మెగాస్టార్ గా ఇండస్ట్రీలో తన సత్తా ఏంటో చూపిస్తూ వస్తున్నాడు. ఇక ఈ క్రమంలో యంగ్ రెబల్ స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ కూడా చిరంజీవి అభిమాని అనే విషయం చాలా మందికి తెలియదు. వారి పెద్ద నాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరో అయినప్పటికీ కృష్ణంరాజు కాకుండా తనకి బాగా నచ్చిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది చిరంజీవి గారే అని ఇప్పటికీ ప్రభాస్ చాలాసార్లు చెప్పాడు. ఆయనకు చిరంజీవి అంటే ఎందుకు అంత ఇష్టం అంటే చిరంజీవి బాగా డ్యాన్స్ వేస్తాడు అలా డ్యాన్స్ చేసేవారంటే చాలా ఇష్టమంటా,ఇక చిరంజీవి నచ్చడానికి అదొక కారణం అయితే చిరంజీవి నటనలో వేరియేషన్స్ కూడా తను బాగా ఇష్టపడతారంటు మరికొన్ని వార్తలు కూడా బయటకు వచ్చాయి.
స్వయంకృషి, ఆపద్బాంధవుడు, గ్యాంగ్ లీడర్ లాంటి ఇలా వేరియేషన్స్ ఉన్న సినిమాలు చేయడంలో చిరంజీవి చాలా ఎప్పుడు ముందుండే వాడు అందుకే చాలా మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. అందువల్లే తను కూడా చిరంజీవి లా ఒక గొప్ప హీరో గా ఎదగాలనే ఉద్దేశంతోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చినట్టుగా కూడా చాలా సార్లు చెప్పాడు. అలాగే ప్రస్తుతం ఉన్న హీరోల్లో చిరంజీవికి ఎక్కువగా నచ్చే హీరో కూడా ప్రభాస్ ఏ కావడం విశేషం… ఇక ఇప్పుడు ప్రభాస్ తన అభిమాన హీరో చేత అభిమానింపబడుతున్నాడు అంటూ ప్రభాస్ అభిమానులు కూడా చాలా వరకు ఖుషి అవుతున్నారు…