Ram Charan: సినిమా ఇండస్ట్రీ లో జూనియర్స్ పట్ల సీనియర్స్ కొంత చులకన భావంతో ఉంటారని చాలా వార్తలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే సీనియర్లు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఇండస్ట్రీలో పాతుకుపోయి ఉంటారు కాబట్టి కొత్తవాళ్లు వచ్చి వాళ్ళ అవకాశాలకి ఇబ్బంది కలిగిస్తారేమో అనే ఉద్దేశ్యంతో కొంతపాటి జలసి ఉన్నప్పటికీ మరి కొంత సీనియార్టీని చూపించుకోవాలనే ఉచ్చుకత కూడా ఉంటుంది.
ఇక ఇప్పటికే ఇలాంటి సంఘటనలు మనం చాలామంది విషయంలో చూసినప్పటికీ మెగాస్టార్ కొడుకు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని కూడా కెరియర్ స్టార్టింగ్ లో కొంతమంది సీనియర్ హీరో లు ర్యాగింగ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. నిజానికి రామ్ చరణ్ ని ర్యాగింగ్ చేసేంత కెపాసిటీ ఇండస్ట్రీలో ఎవరికి లేకపోయినప్పటికీ కొంతమంది సీనియర్ నటులు ఫన్నీగా ఆయన్ని ర్యాగింగ్ చేసినట్టు గా అప్పట్లో వార్తలైతే వచ్చాయి. అయితే అలాంటి వారిలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం లాంటి నటులు ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలో ఆయనతో మేము సీనియర్ నటులం అంటూ ఫన్నీగా అతన్ని ర్యాగింగ్ చేసినట్టుగా అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.
అయితే రామ్ చరణ్ దీన్ని ర్యాగింగ్ గా అనుకోకుండా సీనియర్ నటులు వాళ్ల సలహాలను మనకు ఇస్తున్నారు. వాళ్ల సీనియార్టీని మనం ఫాలో అవ్వాలి అనే ఉద్దేశ్యం లో స్వీకరించి వాళ్ళు ఏం చెప్పినా కూడా దాన్ని తుచా తప్పకుండా పాటిస్తూ వచ్చేవాడు అందువల్లే తను ఈరోజు గ్లోబల్ స్టార్ గా కూడా ఎదిగాడంటూ పలువురు స్నేహితులు సైతం ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ రామ్ చరణ్ గొప్పతనం గురించి చెబుతూ ఉంటారు.
అంత ఓపిక గా ఉన్నాడు కాబట్టే ఆయన ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగారు, ఆయన ఎవరిని ఏమీ అనరు. కాబట్టి సినిమా ఇండస్ట్రీ తనని అక్కున చేర్చుకుంది అంటూ మరి కొంతమంది రామ్ చరణ్ అభిమానులు కూడా అతని గొప్పతనం గురించి ఎప్పుడు చెబుతూ ఉంటారు…