Rajamouli Mahesh Babu Movie: కొన్ని ప్రాజెక్టులు చాలా ప్రస్టేజియస్ గా తెరకెక్కుతుంటాయి.ఇక ఈ సినిమాల మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండటమే కాకుండా అలాంటి సినిమా కోసం ప్రేక్షకుల్లో విపరీతమైన ఎదురుచూపులు కూడా ఉంటాయి. ఇలాంటి క్రమంలో రాజమౌళి లాంటి దర్శకుడి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే పాన్ ఇండియా రేంజ్ లో ఆ సినిమా భారీ అటెన్షన్ ని క్రియేట్ చేసుకుంటుంది అని అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ప్రతి హీరో కూడా రాజమౌళి దర్శకత్వంలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్నారు.
ఆయన సినిమాల్లో ఒక్క క్యారెక్టర్ లో నటించాలని అది ఒక చిన్న పాత్ర అయిన కూడా చేయడానికి సంసిద్ధంగా ఉన్నామంటూ ఇండియాలో ఉన్న ప్రతి నటుడు వాళ్ళ ఇష్టాన్ని తెలియజేయడమనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇలాంటి క్రమంలో ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో ఒక భారీ పాన్ వరల్డ్ సినిమాని చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేసే పని లో రాజమౌళి ఉన్నాడు. ఇక అందులో భాగంగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటున్నారు అనే విషయం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే త్రిబుల్ ఆర్ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా చేసింది.
ఇక ఆ సినిమాలో తన పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ అయితే లేదు ఆ పాత్రని ఫుల్ లెంత్ గా అనుకున్నప్పటికీ సినిమా ఔట్ పుట్ విషయానికి వచ్చేసరికి మాత్రం పాత్ర చాలా చిన్నగా అయిపోయింది. అందువల్లే తన పాత్రకి పెద్దగా న్యాయం జరగలేదని ఆమె కొంచెం అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమాలో కూడా తననే హీరోయిన్ గా పెట్టి ఒక ఫుల్ లెంత్ రోల్ ఇవ్వాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అలియా భట్ కి ఇండియా వైడ్ గా ఎంత క్రేజీ ఉందో మనందరికీ తెలిసిందే అందుకే రాజమౌళి ఆమెని తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
అలాగే ఆమె కి ఒక ఫుల్ లెంత్ రోల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పుడు ఆమెను ఈ సినిమాలో తీసుకున్నట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి…చూడాలి మరి జక్కన్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఆమెకి అవకాశం ఇస్తాడా లేదా అనేది…