Katrina Kaif Marriage: బాలీవుడ్లో మరో ప్రేమజంట పెళ్లిపీటలెక్కింది. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెద్లల సమక్షంలో ఒకటయ్యారు. సెలబ్రిటీ వివాహాలంటే.. అటు సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానులకు ఎంతో ఆసక్తిగా ఉంటుంది. వారు వేసుకున్న డ్రస్, నగల నుంచి పెళ్లికి పెట్టిన ఖర్చు వరకు అన్నింటిపై ఆరాదీస్తారు. ఈ క్రమంలోనే తాజాగా కత్రినా నిశ్చితార్తపు ఉంగరం ఖరీదుపై ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం బాలీవుడ్లో ఈ విషయంపైనా చర్చ నడుస్తోంది. నీలమణితో చేసిన డైమండ్ రింగ్ విలువ దాదాపు ఏడున్నర లక్షల రూపాయలుగా తెలుస్తోంది. ఇటువంటి ఉంగరం బ్రిటన్యువరాణి ప్రిన్సెస్ డయానా ప్రిన్స్ చార్లెస్‌తో నిశ్చితార్థం సమయంలో ధరించింది.
https://twitter.com/KatrinaKaifFB/status/1468996965556002821?s=20
ఇప్పుడు మళ్లీ కత్రినా అలాంటి రింగ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు కత్రిన మెడలో ఉనన నల్లపూసల మంగళసూత్రం విలువ కూడా లక్షల్లో ఖరీదు చేస్తుందని సమాచారం. ఈ నల్లపూసకు చివర్లో రెండు డైమండ్ డ్రాప్స్ వేలాడుతూ కనిపిస్తున్నాయి. ఈ డైమండ్లను విక్కీ తన భార్యకు పెళ్లి కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మంగళసూత్రాన్ని సబ్యసాచి ప్రత్యేకంగా రూపొందించారు.
Also Read: ఈ ఏడాది వివాహ బంధంలో అడుగుపెట్టిన సినీ ప్రముఖులు వీళ్లే..
కాగా, వీరి వెడ్డింగ్ ప్రసారహక్కులను అమెజాన్ ప్రైమ్ కొనేందుకు ముందుకొచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. దాదాపు 100కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే, ఈ డీల్‌పై కత్రినా- విక్కీ రియాక్షన్ తెలియాల్సి ఉంది. వీరి వివాహం రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా హోటల్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ముంబయిలో వీరి రిసెప్షన్ జరగనుంది.
Also Read: సోషల్ మీడియా లో వైరల్ గా మారిన కత్రీనా – విక్కీ పెళ్లి ఫోటోలు…
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More