CID Attacks: ఎంకి మీద కోపం సుబ్బి మీద చూపించినట్టు ఇప్పుడు చంద్రబాబు లూప్ హోల్స్ ఏవీ దొరకకపోవడంతో ఆయనకింద గతంలో పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన రిటైర్డ్ అయిపోయిన ఐఏఎస్ పై ఏపీ సీఐడీ పడింది. అర్థరాత్రి పూట ఆయన తలుపు తట్టి నానా యాగీ చేసింది. చంద్రబాబు ఎక్కడ దొరక్కపోవడంతో ఆయన కింద నమ్మకంగా పనిచేసిన వారిని పట్టుకొని ఏదైనా దొరకబట్టేందుకు ఏపీ సీఐడీ సిద్ధమైంది.

ఏపీ ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయిన లక్ష్మీనారాయణ అనే ఐఏఎస్ అధికారిపై ఏపీ సీఐడీ అధికారులు గురిపెట్టారు. వేధించాలని అనుకున్న వారిని ఎలా అయితే అర్థరాత్రిపూట.. అపరాత్రి పూట దాడి చేసి భయపెడుతారో అచ్చంగా అలాగే రిటైర్ అయిపోయి హైదరాబాద్లో కాలం గడుపుతున్న ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంటిపై అర్థరాత్రి రెండున్నగ గంటల సమయంలో సీఐడీ అధికారులు దాడులు చేయడం సంచలనమైంది. సోదాలంటూ హడావుడి చేశారు.
చంద్రబాబు కింద పీఎస్ గా పనిచేసి రిటైర్ అయ్యాక 2014లో అధికారంలోకి వచ్చిన బాబు.. లక్ష్మీనారాయణను స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించారు. రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వానికి సలహాదారుగా కొనసాగారు.
ఇక ఎక్కడ ఏ లూప్ హోల్ ఉందో కనిపెడుతున్న ఏపీ సర్కార్ ‘ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో రూ.200 కోట్లకు పైగా గోల్ మాల్ జరిగిందని’ సీఐడీ అధికారులకు సెప్టెంబరులో ప్రస్తుత స్కిల్ కార్పొరేషన్ చైర్మన్ అజయ్ రెడ్డి ఫిర్యాదు చేశారు.అప్పుడు కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు ఇప్పుడు సోదాలకు వచ్చారు. ఆయన ఇంట్లో సోదాలు జరుపుతున్న విషయం తెలియడంతో ఉదయమే చంద్రబాబుకు సన్నిహితుడైన న్యూస్ చానెల్ అధినేత వారింటికి వెళ్లి పరామర్శించడం గమనార్హం. పయ్యావుల కేశవ్ లాంటి వారు పరామర్శించారు. సీఐడీ అధికారులకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
Also Read: టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులకు అండగా నిలిస్తే అంతేనా?
సీఐడీ మెరుపు దాడులతో హతాషుడైన మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ కళ్లు తిరిగిపడిపోయాడు. లోబీపీ రావడంతో ఆస్పత్రికి తరలించారు. లక్ష్మీనారాయణ కోసం టీడీపీ అనుకూల మీడియా అధినేత, టీడీపీ నేతలు కదిలిరావడంతో ఆయన టీడీపీకి ఎంత ముఖ్యమో.. ఎన్ని రహస్యాలు తెలుసో అన్న చర్చ సాగుతోంది.
అయితే స్కిల్ డెవలప్ మెంట్ సంస్థ కార్యకలాపాలు ఎండీ పేరుమీదుగా నడుస్తాయని.. డైరెక్టర్ అయిన తనకు సంబంధం లేదని లక్ష్మీనారాయణ సీఐడీ అధికారులకు వివరించారు. రోజువారీ వ్యవహారలతో కానీ.. ఆ సంస్థ ఏమైనా కొనుగోళ్లు, ఒప్పందాలతో డైరెక్టర్ అయిన లక్ష్మీనారాయణకు ఎలాంటి సంబంధాలు ఉండవు. అయినా కూడా ఎండీని వదిలిపెట్టి చంద్రబాబు పీఎస్ గా చేసిన లక్ష్మీనారాయణను సీఐడీ అధికారులు టార్గెట్ చేయడం విమర్శలకు తావిస్తోంది.
Also Read: భార్య తలనరికిన భర్త.. తలతో నేరుగా పోలీస్ స్టేషన్ కు..