Homeఎంటర్టైన్మెంట్Dil Raju Targeting Peddi Movie: దిల్ రాజు పెద్ది మూవీ ని టార్గెట్ చేశాడా..?

Dil Raju Targeting Peddi Movie: దిల్ రాజు పెద్ది మూవీ ని టార్గెట్ చేశాడా..?

Dil Raju Targeting Peddi Movie: సినిమా ఇండస్ట్రీలో సినిమాల మధ్య పోటీ అనేది సర్వసాధారణంగా ఉంటుంది. ఒక సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే మరో సినిమా కూడా దానిని మించిన సక్సెస్ సాధించాలని కోరుకుంటూ ఉంటారు. ఎలాగైతే హీరోల మధ్య పోటీ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. కానీ ప్రొడ్యూసర్ల మధ్య కూడా విపరీతమైన పోటీ అయితే ఉంది. ఇక్కడ దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ సైతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటే మైత్రి […]

Dil Raju Targeting Peddi Movie: సినిమా ఇండస్ట్రీలో సినిమాల మధ్య పోటీ అనేది సర్వసాధారణంగా ఉంటుంది. ఒక సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే మరో సినిమా కూడా దానిని మించిన సక్సెస్ సాధించాలని కోరుకుంటూ ఉంటారు. ఎలాగైతే హీరోల మధ్య పోటీ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. కానీ ప్రొడ్యూసర్ల మధ్య కూడా విపరీతమైన పోటీ అయితే ఉంది. ఇక్కడ దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ సైతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటే మైత్రి మూవీ మేకర్స్ సైతం వరుస సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే వాళ్లు వైవిధ్యభరితమైన సినిమాలను చేస్తూ హీరోలందరితో మంచి విజయాలను సాధిస్తున్నారు. పెద్ది సినిమాను జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ వివాదం మరోసారి తెరమీదకి వచ్చింది. ఇక దిల్ రాజు కావాలనే ఈ వివాదాన్ని ముందు ఉండి నడిపిస్తున్నాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

నిజానికి దిల్ రాజుకి మైత్రి వాళ్లకి మధ్య చాలా రోజుల నుంచి కొన్ని గొడవలైతే ఉన్నాయి. ఈ సినిమాలకు సంబంధించిన విషయాల్లోనే వాళ్ళు ఎప్పటికప్పుడు విభేదించుకుంటూ రావడం వల్ల వాళ్ళిద్దరి మధ్య కోల్డ్ వారైతే నడుస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ క్రమంలోనే దిల్ రాజు కావాలనే పెద్ది సినిమాను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నాడని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మైత్రి వాళ్లు పెద్ది సినిమాతో భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మైత్రి మూవీ మేకర్స్ కి ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ రావడం లేదు. కాబట్టి వాళ్ళు చాలా వరకు డీలా పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.

ఇక ఇలాంటి క్రమంలోనే సింగిల్ స్క్రీన్స్ వివాదాన్ని ముగిస్తారా? లేదంటే సినిమాకి సరైన థియేటర్లు లేక ఇబ్బంది పడే పరిస్థితిని తీసుకొస్తారా? అనేది తెలియాల్సి ఉంది… ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధించినా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న హీరోలైతే ఎవరు లేరు. మరి వాళ్ళు చేయాల్సిన సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper