Homeఎంటర్టైన్మెంట్Dil Raju Son Video: కొడుకుని చితకబాదిన నిర్మాత దిల్ రాజు.. వైరల్ అవుతున్న వీడియో..

Dil Raju Son Video: కొడుకుని చితకబాదిన నిర్మాత దిల్ రాజు.. వైరల్ అవుతున్న వీడియో..

Dil Raju Son Video: ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినీ కెరీర్ ఒకప్పటి రేంజ్ లో ముందుకు సాగడం లేదనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చేతిలో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా లేదు. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చాడని అంటున్నారు కానీ , దీనిపై ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు. ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ‘ఎల్లమ్మ’, ‘రౌడీ జనార్దన్’ వంటి సినిమాలు నిర్మాణం లో ఉన్నాయి. ఇది కాకుండా దిల్ […]

Dil Raju Son Video: ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినీ కెరీర్ ఒకప్పటి రేంజ్ లో ముందుకు సాగడం లేదనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చేతిలో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా లేదు. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చాడని అంటున్నారు కానీ , దీనిపై ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు. ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ‘ఎల్లమ్మ’, ‘రౌడీ జనార్దన్’ వంటి సినిమాలు నిర్మాణం లో ఉన్నాయి. ఇది కాకుండా దిల్ రాజు అల్లుడి సినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. ఇదంతా పక్కన పెడితే దిల్ రాజు సోషల్ మీడియా లో పెద్దగా యాక్టీవ్ గా ఉండదు అనే విషయం అందరికీ తెలిసిందే. కేవలం ఆయన ప్రొడక్షన్ టీం మాత్రమే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ని సోషల్ మీడియా లో చెప్తుంటారు. కానీ దిల్ రాజు సతీమణి తేజస్విని మాత్రం సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉంటుంది.

ఇన్ స్టాగ్రామ్ లో ఈమె అప్లోడ్ చేసే రీల్స్ కి , ఫొటోలకి మామూలు రేంజ్ రీచ్ ఉండదు. మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తుంటాయి. రీసెంట్ గా ఈమె దిల్ రాజు తన కొడుకుని చిన్న ప్లాస్టిక్ కర్ర తీసుకొని పిర్రలపై కొడుతున్న వీడియో ని అప్లోడ్ చేసింది. ఆ వీడియోలో దిల్ రాజు ‘ఇంకోసారి అలా అంటావా?’ అని కొడుతుండగా , ఆయన కొడుకు ‘అంటాను..అంటాను’ అని సమాధానం ఇవ్వడం , చివరగా దిల్ రాజు నుండి తప్పించుకొని పారిపోతూ ‘అంటాను’ అని మరోసారి గట్టిగా అరవడం చూసేందుకు చాలా ఫన్నీ గా అనిపించింది. దీనికి తేజస్విని క్యాప్షన్ పెడుతూ ‘జెన్ ఆల్ఫా కిడ్స్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం’ అంటూ చెప్పుకొచ్చింది. ఇన్ స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఇలాంటి ఫన్నీ వీడియోస్ ని దిల్ రాజు సతీమణి తేజస్విని చాలానే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper