Naga Chaitanya : అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అక్కినేని నాగ చైతన్య, తనదైన శైలిలో ప్రేమ కథ చిత్రాలు చేస్తూ యూత్ లో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. మొదటి సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినప్పటికీ, రెండవ సినిమా ‘ఏ మాయ చేసావే’ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా టాలీవుడ్ లవ్ స్టోరీస్ లో ఆల్ టైం క్లాసిక్ గా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ సినిమా ద్వారా పరిచయమైన సమంత తో నాగ చైతన్య ప్రేమలో పడి , పెళ్లి చేసుకొని విడాకులు కూడా తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
ఇదంతా పక్కన పెడితే చూసేందుకు నాగ చైతన్య ఎంతో అమాయకంగా, రాముడు మంచి బాలుడు లాగ కనిపిస్తాడు కానీ, వాస్తవానికి ఆయన ఒక కృష్ణుడు అని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ఎప్పటి నుండో వినిపిస్తున్న వార్త. రానా దగ్గుపాటి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘నెంబర్ 1 యారి విత్ రానా’ అనే టాక్ షోలో నాగ చైతన్య, సుమంత్ ఒక ఎపిసోడ్ కి ముఖ్య అతిథులుగా హాజరవుతారు. ఈ ఎపిసోడ్ లో రానా నాగ చైతన్య ని ఒక ప్రశ్న అడుగుతూ ‘నీకు మొదటి ముద్దు ఏ వయస్సులో ఉన్నప్పుడు జరిగింది’ అని అడగగా, నాగ చైతన్య అందుకు సమాధానం చెప్తూ ‘9 వ తరగతి లో ఉన్నప్పుడు జరిగింది’ అని అంటాడు. దీనికి రానా సుమంత్ ఇద్దరు షాక్ కి గురవుతారు. అప్పుడు రానా మాట్లాడుతూ ‘చూసేందుకు చాలా అమాయకుడిగా కనిపిస్తావు కదరా’ అని అనగా, నాగ చైతన్య అందుకు సమాధానంగా ‘అదే నాకు వర్కౌట్ అయ్యిందిరా’ అని అంటాడు.
అది నిజమే, నాగ చైతన్య అమాయకమైన ముఖాన్ని చూసి ఏ అమ్మాయి అయినా పడిపోవాల్సిందే. సమంత ,శోభిత విషయాల్లో కూడా అదే జరిగింది. అంతకు ముందు నాగ చైతన్య అప్పుడే ఇండస్ట్రీ లోకి వచ్చిన యంగ్ హీరోయిన్ తో కొన్నాళ్ళు డేటింగ్ చేసి బైక్ రైడింగ్స్ కి కూడా వెళ్లేవారట. ఆ తర్వాత ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ మోస్ట్ స్టార్ గా కొనసాగుతున్న ఒక హీరోయిన్ తో కూడా ఆయన ప్రేమాయణం నడిపినట్టు తెలుస్తుంది. అలాగే బంగార్రాజు చిత్రం లో చిన్న రోల్ లో తళుక్కుమని మెరిసిన దీక్షాతో కూడా నాగ చైతన్య కొద్దిరోజులు డేటింగ్ చేసాడట. అలా అమాయకమైన చూపులతో నాగ చైతన్య ఇంతమంది హీరోయిన్స్ తో అఫైర్స్ నడిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం నాగ చైతన్య కార్తికేయ ఫేమ్ చందుమొండేటి తో కలిసి ‘తండేల్’ అనే చిత్రం లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై నాగచైతన్య ఆశలన్నీ పెట్టుకున్నాడు.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read More