spot_img
Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 Two Days Collections: 'ధురంధర్ 2 ' 2 రోజుల వరల్డ్ వైడ్...

Dhurandhar 2 Two Days Collections: ‘ధురంధర్ 2 ‘ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఈ రికార్డ్స్ ని ‘వారణాసి’ కూడా అందుకోవడం కష్టమే!

Dhurandhar 2 Two Days Collections: ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ధురంధర్ 2′(Dhurandhar 2 : The Revenge) మేనియా నే కనిపిస్తోంది. ఆడియన్స్ ఈ చిత్రం కోసం క్యూలు కడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి వరకు హిందీ వెర్షన్ లోనే ఈ చిత్రం అందుబాటులో ఉండేది. అయినప్పటికీ కూడా మన ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎగబడ్డారు అంటేనే అర్థం చేసుకోవచ్చు. దీని రేంజ్ ఎలాంటిది అనేది. ఈ సినిమాని థియేటర్స్ లో చూడకపోతే, ఎదో ఒక గొప్ప అనుభూతిని మిస్ అవ్వబోతున్నాము అనే ఫీలింగ్ ఉండడం వల్లే ప్రతీ రాష్ట్రంలో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ లాంటి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతోంది. రెండు రోజుల థియేట్రికల్ రన్ లో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.

ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాగా, రెండవ రోజున దాదాపుగా 160 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టుగా చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా లో ఈ సినిమాకు ఎలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయో చూస్తే మెంటలెక్కిపోతారు. అక్కడి ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే శనివారం రోజున ఈ చిత్రానికి నార్త్ అమెరికా ప్రాంతం లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 2 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 2.8 మిలియన్ డాలర్లు వచ్చింది. షోస్ మొదలయ్యాక కచ్చితంగా ఈ చిత్రానికి 4 నుండి 4.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వస్తాయని, ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీ లో ఏ సినిమాకు కూడా ఈ రేంజ్ రాలేదని, బహుశా రాజమౌళి ‘వారణాసి ‘ కి కూడా ఈ రికార్డుని అందుకోవడం కష్టమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Also Read: ‘దురంధర్ 2’ లాంగ్ రన్ లో ఎంత వసూలు చేసే అవకాశం ఉందంటే..?

రెండు రోజుల్లో దాదాపుగా 360 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి వీకెండ్ ముగిసేలోపు కచ్చితంగా 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అవుతాయని అంటున్నారు. ఇకపోతే నేడు ఈ చిత్తరానికి సంబంధించిన తెలుగు వెర్షన్ రిలీజ్ అయ్యింది. దీనికి కూడా సెన్సేషనల్ ఓపెనింగ్స్ నమోదు అవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రాన్ని సైతం డామినేట్ చేస్తూ , ఈ చిత్రం రాబడుతున్న వసూళ్లను చూస్తుంటే, ఈ సినిమా తెలుగు వెర్షన్ నుండి కూడా వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టేలా ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular