spot_img
Homeఅంతర్జాతీయంIran striking power: 21 రోజులైనా తగ్గని ఇరాన్‌ స్ట్రైకింగ్‌ పవర్‌.. విలవిలాడుతున్న గల్ఫ్‌.. ఆందోళనలో...

Iran striking power: 21 రోజులైనా తగ్గని ఇరాన్‌ స్ట్రైకింగ్‌ పవర్‌.. విలవిలాడుతున్న గల్ఫ్‌.. ఆందోళనలో అమెరికా!

Iran striking power: ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలు పెట్టి 21 రోజులు అయింది. ఇప్పటికీ ఇరాన్‌ ఒంటరిగా పోరాడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్‌ దేశాలు ఇరాన్‌పై దాడులు చేస్తున్నా సమర్థవంతంగా ఎదుర్కొంంటోంది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌తోపాటు కీలక నేతలు మరణించారు. అధికారులు హతమయ్యారు. ఇరాన్‌లో తీవ్ర విధ్వంసం జరిగింది. అయినా ఇరాన్‌ తొలొగ్గే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు రంజాన్‌ పండుగ ఉన్నా.. ముస్లి దేశాలపై దాడులు కొనసాగిస్తోంది. రక్షణాత్మకంగా బలపడుతూ ప్రతీకార దాడులతో ప్రత్యర్థులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ సంఘర్షణ ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తూ ప్రపంచవ్యాప్త ఆందోళనలను రేకెత్తిస్తోంది.

ఇరాన్‌ స్పష్టమైన వ్యూహం
అమెరికా–ఇజ్రాయెల్‌ దాడులతో నేతలు, మౌలిక సదుపాయాలు నష్టపోయినా ఇరాన్‌ దాడి సామర్థ్యాన్ని కాపాడుకుంది. ఎఫ్‌–35 స్టెల్త్‌ విమానాన్ని కిందపడేసి అధునాతన రాడార్‌ సాంకేతికతను ప్రదర్శించడం శత్రువుల్లో భయాన్ని మేల్కొల్పింది. ఈ సంఘటన పైలట్‌ గాయాలతోపాటు 100 మిలియన్‌ డాలర్ల నష్టాన్ని కలిగించింది, స్టెల్త్‌ టెక్నాలజీపై సందేహాలు రేకెత్తించింది.

అరబ్‌ దేశాలపై ప్రతీకార దాడులు
అమెరికా మద్దతుదారులైన సౌదీ, యూఏఈ, ఖతార్, కువైట్‌లో ఇంధన కేంద్రాలపై దాడులు వరుసగా జరుగుతున్నాయి. కువైట్‌ రిఫైనరీలు, సౌదీ ఎగుమతి ఓడరేవులు, ఖతార్‌ ఎల్‌ఎన్‌జీ ప్లాంట్లు లక్ష్యాలుగా మారాయి. ఖతార్‌కు 20 బిలియన్‌ డాలర్ల హాని, 20 ఏళ్ల వెనుకబాటుతన్ని తెచ్చిపెట్టాయి, ఇవి అమెరికా సహకారానికి ప్రతీకారంగా మారాయి.

ప్రాంతీయ ఉద్రిక్తతలు
రంజాన్‌ పర్వదిన సమయంలోనూ దాడులు ఆగకపోవడం మతపరమైన విభేదాలను ఉద్ఘాటించింది. సౌదీలో ఆహ్వానాలు పెరగడం, ఒమాన్, బహ్రెయిన్‌లో భయాందోళనలు తీవ్రమవుతున్నాయి. ఇరాన్‌ ముస్లిం దేశాలను సవాల్‌ చేస్తూ ప్రాంతీయ ఐక్యతను సవాలు చేస్తోంది, ఇది దీర్ఘకాల యుద్ధానికి దారితీసే అవకాశాన్ని పెంచుతోంది.

ఆర్థిక ప్రభావం..
ఇంధన ఉత్పత్తి, రవాణా ఆగిపోవడం చమురు, గ్యాస్‌ ధరలను ఆకాశారోహణకు దారితీస్తోంది. అరబ్‌ దేశాల ఆర్థిక నష్టాలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తూ ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయి. అమెరికాలో అల్లకల్లోలం, సైనిక ఒత్తిడి పెరగడం యుద్ధాన్ని మరింత సంక్లిష్టం చేస్తోంది.

ఇరాన్‌ బలాన్ని కోల్పోకపోవడం యుద్ధాన్ని విస్తరించే అవకాశాన్ని సృష్టిస్తోంది. డిప్లొమసీ, అంతర్జాతీయ మధ్యవర్తిత్వం లేకుండా పరిస్థితి తీవ్రమవుతుంది. ప్రపంచ దేశాలు ఇంధన వైవిధ్యత, సంక్షోభ నిర్వహణపై దృష్టి పెట్టాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Venkatesh Kalyan Ram Movie

Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి కి తెలియకుండా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ఎంజాయ్ చేస్తున్నారుగా…

Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను చేస్తూ...
Bigg Boss Telugu

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ పై జబర్దస్త్ బ్యూటీ హాట్ కామెంట్స్.. ఈ...

Bigg Boss 10 Telugu: సెప్టెంబర్ 6 న ఇండియా వైడ్ గా అన్ని భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్...
Oktelugu Epaper