spot_img
Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh 2 Days Collections: 'ఓజీ' మొదటి రోజు వసూళ్లు 154 కోట్లు.....

Ustaad Bhagat Singh 2 Days Collections: ‘ఓజీ’ మొదటి రోజు వసూళ్లు 154 కోట్లు.. కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి 2 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఇంతేనా!

Ustaad Bhagat Singh 2 Days Collections: అప్పుడప్పుడు మేకర్స్ తీసుకునే కొన్ని బోల్డ్ నిర్ణయాలు సినిమాలకు తీవ్రమైన నష్టాలను కలగచేస్తుంటాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) విషయం లో మేకర్స్ ఆ తప్పే చేసినట్టుగా అనిపిస్తోంది. ముందుగా అనుకున్న తేదీ అయినటువంటి మార్చి 26 న ఈ చిత్రాన్ని విడుదల చేసుంటే బాగుండేది. కానీ ‘ధురంధర్ 2’ లాంటి భారీ హైప్ ఉన్న సినిమా విడుదలైన రోజునే , ఈ చిత్రాన్ని కూడా విడుదల చేయడం మామూలు మిస్టేక్ కాదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ‘ధురంధర్ 2’ తో పోటీ కారణంగా నైజాం లో మేకర్స్ ఈ చిత్రానికి టికెట్ రేట్స్ పెంచలేదు. దాని వల్ల , మొదటి రోజు ఈ చిత్రానికి అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదు అయినప్పటికీ , తక్కువ వసూళ్లనే చూడాల్సి వచ్చింది. ఇక ఓవర్సీస్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఇండియా లో సీక్వెల్ క్రేజ్ లేకుండా, నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ నుండి 3 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఇద్దరు ముగ్గురు హీరోలలో ఒకరు పవన్ కళ్యాణ్. అలాంటి సూపర్ స్టార్ తదుపరి చిత్రానికి కనీసం ప్రీమియర్ షోస్ నుండి 3 లక్షల డాలర్లు కూడా రాకపోవడమంటే ఎంత దారుణమో అర్థం చేసుకోండి. అంత తక్కువ గ్రాస్ నమోదు అవ్వడానికి ప్రధాన కారణం , ‘ధురంధర్ 2’ చిత్రమే. అంతటి క్రేజ్ ఉన్న సినిమాకు ఫ్రీ పాసులు ఇవ్వడం , ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ మూవీ టికెట్ రేట్స్ 20 డాలర్లకు పైగా ఉండడంతో , తెలుగు ఆడియన్స్ కూడా ఆ సినిమాకే బ్రహ్మరథం పట్టారు. లేదంటే ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రానికి కచ్చితంగా ప్రీమియర్ షోస్ నుండి 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చేవి. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గత చిత్రం ఓజీ కి మొదటి రోజున 154 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

Also Read: ‘ధురంధర్ 2 ‘ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఈ రికార్డ్స్ ని ‘వారణాసి’ కూడా అందుకోవడం కష్టమే!

కానీ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి రెండు రోజులకు కలిపి 70 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి రెండవ రోజున 9 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. వంద కోట్ల గ్రాస్ ని అందుకోవడానికి ఈరోజు తో పాటు, రేపు కూడా అవసరం అయ్యేలా ఉంది. 6 నెలల క్రితం విడుదలైన సినిమాకు , ఈ సినిమాకు ఇంత తేడా ఉండడానికి కారణం కంటెంట్. సరైన కంటెంట్ తో వస్తేనే ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా ఈ ట్రెండ్ లో నెగ్గుకుని రాయగలరు. లేదంటే ఎంత పెద్ద పవర్ స్టార్ అయినా చతికిల పడాల్సిందే అని మరోసారి ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ద్వారా నిరూపితమైంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Oktelugu Epaper