Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 Runtime: హద్దులు దాటిన 'ధురంధర్ 2' రన్ టైం..ఇది అసలు వర్కౌట్ అయ్యేలా...

Dhurandhar 2 Runtime: హద్దులు దాటిన ‘ధురంధర్ 2’ రన్ టైం..ఇది అసలు వర్కౌట్ అయ్యేలా లేదు!

Dhurandhar 2 Runtime: గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం ఇప్పటికీ పలు థియేటర్స్ లో విజయవంతంగా ఆడుతూనే ఉంది. బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 1400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా , రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో విడుదలై 20 మిల్లియన్లకు పైగా వ్యూస్ ని సాధించినప్పటికీ కూడా థియేటర్స్ లో ఈ సినిమా ఆడుతూనే ఉందంటే సాధారణమైన విషయం కాదు. […]

Dhurandhar 2 Runtime: గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం ఇప్పటికీ పలు థియేటర్స్ లో విజయవంతంగా ఆడుతూనే ఉంది. బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 1400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా , రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో విడుదలై 20 మిల్లియన్లకు పైగా వ్యూస్ ని సాధించినప్పటికీ కూడా థియేటర్స్ లో ఈ సినిమా ఆడుతూనే ఉందంటే సాధారణమైన విషయం కాదు. అలాంటి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ‘ధురంధర్ 2 – ది రివెంజ్'(Dhurandhar 2 – The Revenge) చిత్రం ఈ నెల 19 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుంది. అయితే మేకర్స్ ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ ని మొదలు పెట్టలేదు. చాలా మందికి అసలు ఈ చిత్రం విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

ఇదంతా పక్కన పెడితే , రీసెంట్ గానే మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన రన్ టైం ని లాక్ చేసినట్టు తెలుస్తోంది. అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రం రన్ రన్ టైం దాదాపుగా 3 గంటల 55 నిమిషాల వరకు ఉంటుందట. మూడు గంటల నిడివి ఉన్నా, లేకపోతే మూడు గంట 20 నిమిషాల నిడివి ఉన్నా చూసేందుకు మన ఆడియన్స్ ఓపిక చూపిస్తారు. కానీ ఇలా ఏకంగా 4 గంటల సమయం అంటే కచ్చితంగా ఆలోచిస్తారు. ముఖ్యంగా థియేటర్స్ లో నాలుగు షోస్ పడాల్సిన చోట, కేవలం మూడు షోస్ మాత్రమే పడుతుంది. ఒక సినిమా కోసం నాలుగు గంటల విలువైన సమయాన్ని వెచ్చించడమే కాకుండా, మధ్యలో ట్రావెలింగ్ కి మరో గంట సమయం. మొత్తం మీద 5 గంటలకు పైగా సమయాన్ని మనం ఈ చిత్రం కోసం కేటాయించాలి అన్నమాట.

Also Read: విజయ్ దేవరకొండ – రష్మిక లకు అల్లు అర్జున్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడుగా…

ఇంత సమయాన్ని వెచ్చించగలరా..?, పాజిటివ్ టాక్ వస్తే పర్లేదు, అదే నెగెటివ్ టాక్ వస్తే మాత్రం ఈ చిత్రం దారుణమైన ఫలితాన్ని చూసే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. మొదటి భాగం ఉన్న అడ్వాంటేజ్ లు రెండవ భాగం లో ఉండకపోవచ్చు. మొదటి భాగం మన ఆడియన్స్ కి అంతలా కనెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం , యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకోవడం వల్లే. కానీ రెండవ భాగం లో ఆ ఛాన్స్ లేదు. ఎక్కువ శాతం కల్పిత కథ నే ఉంటుంది. అంతే కాకుండా, మొదటి భాగానికి వెన్నుముక లాగా నిల్చిన రెహమాన్ డెకాయిట్ పాత్ర ఇందులో ఉండదు. ఇది అతి పెద్ద మైనస్ అని అనుకోవచ్చు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper