Dhurandhar 2 controversy: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు దక్కుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీ సైతం తమదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘దురంధర్ 2’ సినిమా పెను రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక ఇప్పటి వరకు దురంధర్ 2 సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టుగానే భారీ ఓపెనింగ్స్ కూడా వచ్చాయి… చాలామంది సినిమా సెలబ్రిటీలు సైతం సినిమా ని చూసి ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోని బాలీవుడ్ స్టార్ హీరోలు అయిన ఖాన్ త్రయం అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లాంటి వాళ్ళు మాత్రం ఈ సినిమా మీద పాజిటివ్ గా స్పందించిన కూడా వాళ్ళు పూర్తిస్థాయిలో ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడం లేదు.
కారణం ఏంటి అంటే రన్వీర్ సింగ్ లాంటి నటుడు దురంధర్ మొదటి పార్ట్ తో 1300 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టడం ఒకెత్తయితే ఇప్పుడు వచ్చిన ‘దురంధర్ 2’ 1500 కోట్లకు పైన కలెక్షన్స్ ను ఈజీగా రాబడుతుందనే నమ్మకం అందరిలో ఉంది. కాబట్టి వాళ్లు మేము చాలా వరకు వెనుకబడిపోయామనే ఫీల్ లో ఉన్నారు.
Also Read: రాజమౌళి యూత్ లో ఉన్నప్పుడు ఆ హీరో కోసం చొక్కాలు చించుకునేవాడా..?
ఇక ప్రస్తుతం యంగ్ హీరో అయిన రణ్వీర్ సింగ్, అలాగే డైరెక్టర్ ఆదిత్య ధర్ ను ఎంకరేజ్ చేయడం లేదంటూ చాలా కామెంట్లు వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న దర్శకులలో ఆదిత్య ధర్ సైతం ఒకరనే చెప్పాలి.
ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధించిన కూడా ఆదిత్య ధర్ సాధించిన విజయాలు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ ఎలిమెంట్ ఉంటుంది. మరి అలాంటి దర్శకుడు రాబోయే రోజుల్లో కూడా పెను సంచలనాలను సృష్టిస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…