Rajamouli favorite hero: దేశం గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలు ఆయన్ను టాప్ లెవల్లో నినిల్చోబెట్టాయి. మొదట తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన పాన్ ఇండియా పరిధిని దాటి తాను వరల్డ్ లోకే ఎంట్రీ ఇస్తున్నాడు..ఇక ఇలాంటి రాజమౌళి ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా జాగ్రత్తలైతే తీసుకుంటున్నాడు… ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఆయన సినిమాలను డిజైన్ చేసుకుంటున్నాడు. స్టార్ హీరోలు సైతం సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు అంటే ఆయన ఏ రేంజ్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు.
మహేష్ బాబు లాంటి నటుడితో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని తన అభిమానులుగా మార్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో భారీ విజయాలను అందుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read: పవన్ కళ్యాణ్ అంటే ఆ హీరో కి చాలా ఇష్టం కానీ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడా..?
ఇక రాజమౌళి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరోలందరు అతనికి నచ్చినప్పటికి ఒక స్టార్ హీరో అంటే అతనికి విపరీతమైన ఇష్టం ఉండేదట. ఆ స్టార్ హీరో కోసం చొక్కాలు చించుకొని మరి సినిమాలను చూసిన రోజులు ఉన్నాయంటూ గతంలో రాజమౌళి చెప్పాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అంటే పవన్ కళ్యాణ్ కావడం విశేషం…
‘తొలిప్రేమ’ సినిమా తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ కి అభిమానిగా మారిపోయాడట…ఆయన బయట ఎక్కడ కూడా ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పనప్పటికి ఒక ఇంటర్వ్యూలో మాత్రం అప్పట్లో ఒక హీరో కోసం నేను కూడా చొక్కాలు చించుకొని సినిమాలకు వెళ్లాను అంటూ ఆయన చెప్పాడు. దాన్ని బట్టి చూస్తే ఆ టైంలో పవన్ కళ్యాణ్ కే అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది… రాజమౌళి ఇప్పటివరకు తన ఎంటైర్ కెరీర్ లో ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ తో సినిమాలైతే చేయలేదు. ఆయన కెరియర్ లో ఏదైనా అసంతృప్తి ఉంది అంటే అది ఇది ఒకటే అని పలు సందర్భాల్లో తెలియజేశాడు…