spot_img
Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 Ban Demand Controversy: దురంధర్‌ 2ను బ్యాన్‌ చేయాలి.. ఆ రెండు పార్టీల...

Dhurandhar 2 Ban Demand Controversy: దురంధర్‌ 2ను బ్యాన్‌ చేయాలి.. ఆ రెండు పార్టీల వింత డిమాండ్‌!

Dhurandhar 2 Ban Demand Controversy: దురంధర్‌.. సినిమా ఇండస్ట్రీని షేక్‌ చేసిన సినిమా. పాకిస్తాన్‌లో భారత ఏజెంట్ల గూఢచర్యాన్ని ఇందులో చూపించారు. ఈ సినిమా రికార్డు కలెక్షన్లు రాబట్టింది. దీనికి సీక్వల్‌గా తెరకెక్కిన ‘దురంధర్‌ 2’ సినిమా ఇటీవల రిలీజ్‌ అయింది. యావత్‌ దేశం మొత్తం ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొదటి రోజే రూ.248 కోట్లు వసూలు చేసి రికార్డులు బద్దలు కొట్టింది. అయితే ఈ సినిమాను బ్యాన్‌ చేయాలని ఇప్పుడు మన దేశంలోని రెండు ప్రధాన పార్టీలు, మరికొన్ని చిన్నాచితక పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ సినిమాలో అందరికీ దేశభక్తి, పాకిస్తాన్‌ కుట్రలు, మాఫియా, ఉగ్రవాద చర్యలు కనిపిస్తుంటే.. ఆ పార్టీలకు మాత్రం ఈ సినిమా ముస్లిం వ్యతిరేక సినిమాగా కనిపిస్తుందట.

Also Read: టోర్నీకి ముందే చెన్నై పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి.. ఎవరు కాపాడుతారు?

సినిమా కథన సారాంశం
రణవీర్‌ సింగ్‌ హీరోగా, ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో 4 గంటల సీక్వెల్‌లో భారత ఏజెంట్‌ హమ్జా పాక్‌ ఐఎస్‌ఐ, లష్కర్‌–ఏ–తొయిబా కుట్రలను ఛేదిస్తాడు. యూపీ మాఫియా, దొంగ నోట్ల రద్దు ప్రభావం, జాకీర్‌నాయక్‌ రెండు పాక్‌ ఉగ్రవాదులను మోసం చేసి భారత్‌ను రక్షిస్తాడు. మొదటి భాగం రూ.1300 కోట్లు సాధించినా, ఇది మరింత భారీగా ప్రపంచవ్యాప్తంగా హిట్‌ అవుతోంది. పాకిస్తాన్‌లో నిషేధించినా పైరసీ ద్వారా వీక్షణ జరుగుతోంది.

రాజకీయ నేతల విమర్శలు
కాంగ్రెస్, సమాజ్‌వాదీ ఎంపీలు ఇమ్రాన్‌ మసూద్, రషీద్‌ అల్వీ, తారిక్‌ అన్వర్‌ సినిమాను బీజేపీ ఎజెండాతో రూపొందించారని, ఇది మత ద్వేషాన్ని పెంచుతుందని ఆరోపించారు. çఈ సినిమా ‘సమాజాన్ని విడదీయడానికి ఉపయోగపడుతుంది, యువతకు తగని హింస‘ అని రాజేశ్‌ రాథోడ్, అసిత్‌ నాథ్‌ తివారీలు అన్నారు.

ఒకప్పుడు దావూద్‌ కనుసన్నల్లో..
2014 ముందు దావూద్‌ ఇబ్రహీం ప్రభావంతో ఉగ్రవాదాన్ని మెత్తగా చూపించే సినిమాలు వచ్చాయి. ఇప్పుడు జాతీయవాద కథనాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ’దురంధర్‌’ సిరీస్‌ దాని ఉదాహరణ, పాక్‌ మేజర్‌ ఇక్బాల్, ఎంపీ జమీల్‌ వంటి పాత్రలు రియల్‌ ఇన్సి్పరేషన్‌తో తయారయ్యాయి. ముంబై పోలీసు డ్రోన్‌ ఉల్లంఘనలపై కేసు నమోదు చేసినా, రిలీజ్‌కు ప్రభావం లేదు. పాకిస్తాన్‌ ప్రజలు దురంధర్‌ 1 ను ఎక్కువగా చూశారు. ప్రభుత్వం నిషేధించినా నెట్‌ఫ్లిక్స్‌ నుంచి ఎక్కువగా డౌన్‌లోడ్‌ చేసుకుని వీక్షించారు. మన నాయకులకు మాత్రం ముస్లిం వ్యతిరేకత మాత్రమే కనిపిస్తుంది

సినిమా విజయం బీజేపీకి ప్రచారంగా మారడం, ప్రతిపక్షాల బ్యాన్‌ డిమాండ్లు రివర్స్‌ ప్రచారంగా పనిచేయడం ఆసక్తికరం. కంటెంట్‌ స్వేచ్ఛ, రాజకీయ సున్నితత్వం మధ్య సమతుల్యత అవసరం. ఈ వివాదం బాలీవుడ్‌లో జాతీయవాద ట్రెండ్‌ను బలోపేతం చేస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper