HomeతెలంగాణJeevan Reddy Party Change: కాంగ్రెస్‌లో ‘జీవన’తరంగాలు

Jeevan Reddy Party Change: కాంగ్రెస్‌లో ‘జీవన’తరంగాలు

Jeevan Reddy Party Change: తెలంగాణ కాంగ్రెస్‌లో జీవన తరంగాలు కాకపుట్టిస్తున్నాయి. సీనియర్‌ నేత జీవన్‌ రెడ్డి అసంతృప్తి తీవ్రస్థాయిలోకి మారింది. ఉగాది పండుగ తర్వాత జీవన్‌రెడ్డి పార్టీ మారతారన్న ప్రచారం ఊపందుకుంది. ఈమేకు జీవన్‌రెడ్డి కూడా పార్టీ మార్పుపై ఉగాది తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. దీంతో అధిష్టానం బుజ్జగింపు చర్యలు ప్రారంభించింది. Also Read: టోర్నీకి ముందే చెన్నై పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి.. ఎవరు కాపాడుతారు? జీవన్‌ రెడ్డి అసంతృప్తి 40 ఏళ్ల […]

Jeevan Reddy Party Change: తెలంగాణ కాంగ్రెస్‌లో జీవన తరంగాలు కాకపుట్టిస్తున్నాయి. సీనియర్‌ నేత జీవన్‌ రెడ్డి అసంతృప్తి తీవ్రస్థాయిలోకి మారింది. ఉగాది పండుగ తర్వాత జీవన్‌రెడ్డి పార్టీ మారతారన్న ప్రచారం ఊపందుకుంది. ఈమేకు జీవన్‌రెడ్డి కూడా పార్టీ మార్పుపై ఉగాది తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. దీంతో అధిష్టానం బుజ్జగింపు చర్యలు ప్రారంభించింది.

Also Read: టోర్నీకి ముందే చెన్నై పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి.. ఎవరు కాపాడుతారు?

జీవన్‌ రెడ్డి అసంతృప్తి
40 ఏళ్ల కాంగ్రెస్‌ అనుభవానికి ఉన్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, పార్టీలో గౌరవం లేకపోవడం, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరాక కాంగ్రెస్‌ వ్యవహారాలు కూడా ఆయనే చూస్తుండడంతో జీవన్‌రెడ్డి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థులను వేరుగా ప్రకటించి స్వతంత్రంగా పోటీచేయించారు. చైర్‌పర్సన్‌ పదవి కోసం పట్టుబట్టాడు. కానీ అధిష్టానం సంజయ్‌ చెప్పిన అభ్యర్థినే చైర్‌పర్సన్‌గా ఎంపిక చేసింది. దీంతో జీవన్‌రెడ్డిలో అసంతృప్తి మరింత తీవ్రమైంది. ఈ క్రమంలో జగిత్యాలలో ఆయన ఇంటి ముందు కాంగ్రెస్‌ ఫ్లెక్సీలు తొలగించి ’జన జీవనుడు’ బ్యానర్లు ఏర్పాటు చేశారు. మరోవైపు మక్క కొనుగోలు కేంద్రాలు, రైతు సమస్యలపై జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ధిక్కార స్వరం వినిపించారు.«

సంజయ్‌ కుమార్‌ వివాదం
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ను ప్రధాన కారణంగా చెబుతూ జీవన్‌ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన సంజయ్‌ ప్రజల అభివృద్ధి హక్కులను కాజేస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఈ విభేదాలు జీవన్‌ అనుచరుల్లో కూడా అసంతృప్తిని పెంచాయి,

అధిష్టాన బుజ్జగింపు
పార్టీ మార్పు ప్రచారాలు జోరెత్తగా, మంత్రి శ్రీధర్‌ను అధిష్టానం రంగంలోకి దించింది. ఏఐసీసీ నేతలతో కలిసి మంత్రి శనివారం కరీంనగర్‌లోని జీవన్‌ ఇంటికి చేరుకున్నారు. పార్టీలో కొనసాగమని, భవిష్యత్‌లో మంచి పదవులు వస్తాయని సూచించారు. కత్తి వెంకటస్వామి సహా నేతలు అరగంట సమావేశాలు జరిపారు. ఈ చర్యలు జీవన్‌ నిర్ణయాన్ని మార్చే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి.

బీఆర్‌ఎస్‌లో చేరతారని..
ఇదిలా ఉంటే ఈ నెల 25న బీఆర్‌ఎస్‌లో చేరతారని జోరుగా ప్రచారం. కొందరు బీజేపీ అవకాశం ఉందని చెబుతున్నారు. జీవన్‌ అనుచరులతో మంతనాలు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన మార్పు కాంగ్రెస్‌కు జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల్లో షాక్‌గా మారవచ్చు.

జీవన్‌ రెడ్డి 4 దశాబ్దాల అనుభవం, గెలిపించే సామర్థ్యం కలిగిన నేతగా పేరుగాంచారు. ఆయన మార్పు కాంగ్రెస్‌ బలాన్ని బలహీనపరుస్తుంది, బీఆర్‌ఎస్‌ లేదా బీజేపీకి బలం చేకూరుస్తుంది. ప్రభుత్వ విధానాలపై ఆయన విమర్శలు పార్టీ అంతర్గత సమస్యలను బయటపెడతాయి. రాబోయే రోజుల్లో ఆయన నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని రాస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper