YS Jagan Mohan Reddy:వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. బెంగళూరులోని యలహంక ప్రాంతంలో జగన్.. షర్మిలకు 20 ఎకరాల విస్తీర్ణంలో భవనాలు కట్టించారు. ఆయన బతికున్నప్పుడే ఇద్దరికీ 10 ఎకరాల చొప్పున పంచారు. షర్మిల కి గృహం కూడా కట్టించారు. ఆయన బతికి ఉన్నప్పుడే గృహ ప్రవేశం కూడా జరిగింది.
ఆ ప్యాలెస్ లో తన కుమార్తె పెళ్లి చేయాలని షర్మిల డిసైడ్ అయ్యారు. తన నివాసంలో అట్టహాసంగా వివాహ వేడుక జరపాలని భావించారు. కానీ భద్రత కారణాలను జగన్ చూపించారు. షర్మిల ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ఆమె వివాహ వేదికను మార్చుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్యాలస్ మీద జరుగుతున్న వివాదం మరో వైపు మారింది . ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ వ్యవహారంలో ఇరుక్కుపోయారు. ఇద్దరి మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించడానికి శివకుమార్ ఆ రంగంలోకి దిగారు. అయితే ఆయనను జగన్ నమ్మించి.. అబద్ధం చెప్పి.. మోసం చేశారని తెలుస్తోంది.
ఈ ప్యాలెస్ విషయంలో షర్మిలకు.. జగన్ కు మధ్య వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో డీకే శివకుమార్ జోక్యం చేసుకున్నారు. వైయస్ కుటుంబంతో శివకుమార్ కు దశాబ్దాలుగా అనుబంధం ఉంది. జగన్ మధ్య.. షర్మిల మధ్య ఉన్న వివాదాన్ని స్వయంగా పరిష్కరించడానికి శివకుమార్ ప్రయత్నించారు. వివాహం జరుగుతున్న సమయంలో జగన్ కు ఎంత భద్రత కావాలంటే అంత భద్రత కర్ణాటక హామీ ఇచ్చారట . అంతగా అవసరం అనుకుంటే రెండు గృహాల మధ్య రేకులతో పెద్ద అడ్డుగోడ కూడా నిర్మిద్దాం అని చెప్పారట. షర్మిల కూతురి వివాహాన్ని ప్రశాంతంగా చేసుకోనివ్వండని గుర్తించారట.. శివకుమార్ ఆస్థాయిలో అభ్యర్థించినప్పటికీ జగన్ మనసు కరగలేదట. పైగా తమ సోదరి మధ్య ఉన్న వివాదం తగ్గిపోయిందని చెప్పారట. డీకే శివకుమార్ కు నేరుగా అబద్ధం చెప్పి.. జగన్ దాట వేసే ప్రయత్నం చేశారు.
జగన్ చెప్పిన మాటను శివకుమార్ నమ్మారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు.. షర్మిల పడుతున్న ఇబ్బందులు చూసిన తర్వాత డీకే కి వాస్తవం బోధపడింది. ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ జగన్ తననే తప్పుదోవ పట్టించారని శివకుమార్ బాధపడుతున్నారట. వైఎస్ కుటుంబంతో ఉన్న సంబంధంతో శివకుమార్ అనేక రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ.. ఉపయోగము లేకుండా పోయింది.