Homeఎంటర్టైన్మెంట్Jana Nayagan censor issues: ఎట్టకేలకు రాజీ పడిన 'జన నాయగన్' నిర్మాతలు..విడుదలకు అడ్డంకులు తొలగినట్టే...

Jana Nayagan censor issues: ఎట్టకేలకు రాజీ పడిన ‘జన నాయగన్’ నిర్మాతలు..విడుదలకు అడ్డంకులు తొలగినట్టే ఇక!

Jana Nayagan censor issues: జనవరి 9న విడుదల అవ్వాల్సిన తలపతి విజయ్(Thalapathy Vijay) ‘జన నాయగన్'(Jana Nayagan Movie) చిత్రాన్ని అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టిన తర్వాత వాయిదా వేయడం అభిమానులను ఏ స్థాయి నిరాశకు గురి చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఈ చిత్రం లో మాత విద్వేషాలను రెచ్చగొట్టే సన్నివేశాలు చాలానే ఉన్నాయని, అవి తొలగిస్తే తప్ప సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వమని బోర్డు సభ్యులు తేల్చి చెప్పడంతో, ఆ చిత్ర […]

Jana Nayagan censor issues: జనవరి 9న విడుదల అవ్వాల్సిన తలపతి విజయ్(Thalapathy Vijay) ‘జన నాయగన్'(Jana Nayagan Movie) చిత్రాన్ని అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టిన తర్వాత వాయిదా వేయడం అభిమానులను ఏ స్థాయి నిరాశకు గురి చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఈ చిత్రం లో మాత విద్వేషాలను రెచ్చగొట్టే సన్నివేశాలు చాలానే ఉన్నాయని, అవి తొలగిస్తే తప్ప సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వమని బోర్డు సభ్యులు తేల్చి చెప్పడంతో, ఆ చిత్ర నిర్మాతలు హై కోర్టు ని ఆశ్రయించడం, హై కోర్టు కూడా సెన్సార్ సభ్యులతో ఏకీభవించడం తో నిర్మాతలకు నిరాశ ఎదురైంది. ఇక వేరే దారి లేక సెన్సార్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసిన సన్నివేశాలను మొత్తం తొలగించి, వారిపై హై కోర్టు లో వేసిన కేసులను కూడా విత్ డ్రా చేసుకున్నారు నిర్మాతలు. తొలగించిన సన్నివేశాల నిడివి దాదాపుగా 20 నిమిషాల వరకు ఉంటుందని సమాచారం.

నేడు సెన్సార్ కి కూడా సభ్యులు షెడ్యూల్ చేశారు. నేడు లేదా రేపు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ కూడా రానుంది. దీంతో ఈరోజు సాయంత్రం లోపు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నెల 20న ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మూవీ బయ్యర్స్ అందరికీ ఈ సమాచారం అందించారట. దీంతో ‘జన నాయగన్’ కి ఉన్న ఇక్కట్లు మొత్తం తొలగిపోయినట్టే అనుకోవచ్చు. నిర్మాతలు ఈ రాజీ పడేది ఎదో ముందే చేసి ఉంటే జనవరి 9న ఈ చిత్రం విడుదల అయ్యేది కదా. విజయ్ చివరి చిత్రం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ భారీ రేంజ్ లో జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 50 కోట్ల రూపాయిల గ్రాస్ బుకింగ్స్ ద్వారానే వచ్చింది. విడుదల తేదికి రెండు రోజుల ముందు పరిస్థితి ఇది.

ఒకవేళ సంక్రాంతికి విడుదల అయ్యుంటే, పండగ సెలవులు బాగా కలిసొచ్చి, ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టి ఉండేది. ఇప్పుడు సమయం, సందర్భం లేకుండా ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసుకునే పరిస్థితి ఏర్పడింది. పాజిటివ్ టాక్ వస్తే పర్లేదు, ఒకవేళ పాజిటివ్ టాక్ రాకపోతే మాత్రం భారీ స్థాయిలో నష్టాలు మిగిలే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ కి రీమేక్ గా తెరకెక్కింది. థియేట్రికల్ ట్రైలర్ ని చూస్తే మక్కీకి మక్కీ దింపేసినట్టు అనిపిస్తోంది. కానీ ఇప్పుడు విజయ్ రాజకీయాల్లో ఉండడం వల్ల, కొన్ని పొలిటికల్ రిఫరెన్స్ సన్నివేశాలు పెట్టడం జరిగింది. అదే ఈ చిత్రం విడుదలను ఆపి వేసేలా చేసింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper