spot_img
Homeఎంటర్టైన్మెంట్Ravindra Jadeja Pushpa Dialogue: తగ్గేదే లే అంటున్న క్రికెటర్ రవీంద్ర జడేజా

Ravindra Jadeja Pushpa Dialogue: తగ్గేదే లే అంటున్న క్రికెటర్ రవీంద్ర జడేజా

Ravindra Jadeja Pushpa Dialogue: వినూత్న నటనతో ఆకట్టుకునే బన్నీ అంటే అందరికి ఇష్టమే. స్టైలిష్ స్టార్ గా తన స్థానాన్ని ఎప్పుడు నిలబెట్టుకునేందుకు శ్రమిస్తుంటాడు. సినిమా సినిమాకు వైవిధ్యమున్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను హృదయాలను కొల్లగొట్టడం తెలిసిందే. వినోదమే ప్రధానంగా సాగే సినిమాల్లో ఆయన ఎలాంటి పాత్ర అయినా అవలీలగా చేస్తున్నాడు. ప్రతి సినిమాకు ఓ వెరైటీ చూపిస్తూ తనలోని హావభావాలు పండించడంలో ఆయనకు సాటి లేరు. చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన వారిలో బన్నీ కూడా ఒకరని తెలిసినా ఎక్కడ కూడా ఆయన పేరు వాడుకోకుండా స్వయంకృషితో ఎదుగుతున్న అల్లు అర్జున్ కెరీర్ ఓ సంచలనమే.

Ravindra Jadeja Pushpa Dialogue
Ravindra Jadeja Pushpa Dialogue

మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా పాత్రలు ఎంచుకోవడంలోనే ఆయన వైవిధ్యం చూపిస్తారు. ఇటీవల విడుదలై సంచలనం సృష్టిస్తున్న పుష్ప సినిమాలో మాస్ పాత్రలో రాణించి ప్రేక్షకుల మదిని దోచుకున్నాడు. కలెక్షన్ల పరంగా పుష్ప ఓ రికార్డు సృష్టిస్తోంది. సుకుమార్ సృష్టించిన సుందర కావ్యం పుష్ప అని తెలుస్తోంది. ఆయన తన మార్క్ ను ప్రదర్శించి పుష్పను ఓ రేంజ్ లో తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.

Also Read: పుష్ప:ది రైజ్​కి అనసూయ పారితోషకం ఎంతో తెలుసా?

సినిమాలో తగ్గేదేలే అనే డైలాగ్ ఇప్పుడు అందరిలో నానుతోంది. ఎవరిని చూసినా ఇదే డైలాగ్ కొడుతూ అనుకరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో కూడా ఇదే డైలాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. సెలబ్రిటీలు సైతం ఇదే డైలాగ్ తో అందరిని ఆకర్షిస్తున్నారు. మాసిన గడ్డంతో అల్లు అర్జున్ నటన సినిమాకే హైలెట్ అని చెబుతున్నారు. దీంతో పుష్ప సినిమా అందరి అంచనాలు తలకిందులు చేస్తూ దూసుకుపోతోంది.

భారత స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా కూడా ఇదే డైలాగ్ తో అదరగొడుతున్నారు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ కు ఎంపికవని రవీంద్ర జడేజా ప్రస్తుతం బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో సాధన చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో జడేజా ట్విటర్ లో తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ డైలాగ్ ను షేర్ చేశారు. దీంతో అందరిలో సందడి నెలకొంది. ప్రముఖులు కూడా బన్నీ డైలాగ్ ను అనుకరించడంతో అందరు హ్యాపీగా ఫీలవుతున్నారు.

Also Read: బాక్సాఫీస్ : ‘పుష్ప’ 6 రోజుల కలెక్షన్స్ !

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Super El Nino

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
AP Rain Alert

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...
Polavaram Project

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...
Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Oktelugu Epaper