Couple Friendly movie OTT release: రీసెంట్ గా ఎలాంటి అంచనాలు లేకుండా వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ ‘ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీ లోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతున్నప్పటికీ సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న సంతోష్ శోభన్ కెరీర్ కి చాలా పెద్ద ప్లస్ అయ్యింది ఈ చిత్రం. అయితే మొదట్లో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా కలెక్షన్స్ చాలా తక్కువగా నమోదు అవుతూ ఉండేవి. అయ్యో పాపం , పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా ఈ సినిమా ఫ్లాప్ అవ్వబోతుందే అని అంతా అనుకున్నారు. కానీ ఎప్పుడైతే మూవీ టీం అంతా కలిసి ప్రభాస్ తో ఇంటర్వ్యూ చేశారో , అప్పుడే ఈ సినిమా జాతకం మారిపోయింది.
ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన మరుసటి రోజే కలెక్షన్స్ లో భారీ పెరుగుదల ని గమనించారు ట్రేడ్ పండితులు. మరి ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ , స్వయంగా ఈ సినిమాని చూడమని చెప్తే చూడకుండా జనాలు ఎందుకుంటారు చెప్పండి. బ్రహ్మరథం పెట్టేసారు. ఫలితంగా బ్రేక్ ఈవెన్ అసాధ్యం అని అనుకున్న ఈ చిత్రం ఇప్పుడు భారీ లాభాలను తెచ్చుకొని సెన్సేషన్ సృష్టించింది. ఇప్పటికీ పలు థియేటర్స్ లో ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ఈ చిత్రాన్ని ఈ నెల 13 న అమెజాన్ ప్రైమ్ వీడియో ని స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. విడుదలకు ముందు ఎలాంటి ఓటీటీ డీల్ జరగలేదు. కానీ విడుదల తర్వాత మాత్రం భారీ రేట్ కి ఈ చిత్రాన్ని కొనుగోలు చేశారట . తెలుగు తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోకి ఈ చిత్రాన్ని అనువదించి అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారు.
Also Read: ‘ఓజీ’ ప్రీమియర్స్ రికార్డుని బద్దలు కొట్టబోతున్న ‘ధురంధర్ 2’.. అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఎంతంటే!
ఇకపోతే ఈ సినిమాలో మానస వారణాసి హీరోయిన్ గా నటించింది. ఇది వరకు ఆమె రెండు సినిమాల్లో నటించింది, కానీ ఎలాంటి గుర్తింపు రాలేదు. కానీ ఈ ఒక్క సినిమాతో ఆమె సంపాదించుకున్న గుర్తింపు అంతా ఇంత కాదు. ప్రతీ కుటుంబం లో ఒక ఆడపిల్ల లాగా ప్రతీ ఒక్కరి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఓటీటీ విడుదల తర్వాత ఆమె రేంజ్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద వరల్డ్ వైడ్ 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ గా నిల్చిన ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ని సొతం చేసుకుంటుందో చూడాలి.