Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 advance bookings: 'ఓజీ' ప్రీమియర్స్ రికార్డుని బద్దలు కొట్టబోతున్న 'ధురంధర్ 2'.. అడ్వాన్స్...

Dhurandhar 2 advance bookings: ‘ఓజీ’ ప్రీమియర్స్ రికార్డుని బద్దలు కొట్టబోతున్న ‘ధురంధర్ 2’.. అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఎంతంటే!

Dhurandhar 2 advance bookings: ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘ధురంధర్ 2′(Dhurandhar 2 : The Revenge) చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చాలా మంది ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కారణం సినిమా ఇంకా పూర్తి అవ్వలేదని చెప్పేవారు. కానీ చెప్పిన తేదీ కంటే ఒక రోజు ముందుగా , అనగా 18 వ తేదీన ప్రీమియర్ […]

Dhurandhar 2 advance bookings: ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘ధురంధర్ 2′(Dhurandhar 2 : The Revenge) చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చాలా మంది ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కారణం సినిమా ఇంకా పూర్తి అవ్వలేదని చెప్పేవారు. కానీ చెప్పిన తేదీ కంటే ఒక రోజు ముందుగా , అనగా 18 వ తేదీన ప్రీమియర్ షోస్ ద్వారా ఈ చిత్రం అన్ని భాషల్లోనూ విడుదల కాబోతుంది. అందుకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టగా, అందుకు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఏ రేంజ్ లో అంటే ఇప్పట్లో బ్రేక్ అవ్వడం అసాధ్యం అనుకున్న పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీ ప్రీమియర్ షోస్ గ్రాస్ రికార్డుని బద్దలు కొట్టేంతలాగా అన్నమాట. ఇప్పటి వరకు ఈ చిత్రానికి ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకసారి వివరంగా చూద్దాం.

ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే ఇక్కడ కూడా ప్రీమియర్ షోస్ వేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లో ఈ చిత్రానికి ఇప్పటి వట్రకు 160 ప్రీమియర్ షోస్ షెడ్యూల్ చేయబడ్డాయి. కేవలం వీటి నుండి కోటి 50 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇది సాధారణమైన విషయం అయితే కాదు. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా ఇప్పటి వరకు ఈ చిత్రానికి 27 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రానికి ఇండియా లో ప్రీమియర్ షోస్ ద్వారా 35 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సినిమా విడుదలకు ఇంకా వారం రోజులు సమయం ఉండడంతో కచ్చితంగా ఈ రికార్డు అవలీలగా బ్రేక్ అవుతుందని అనుకుంటున్నారు మేకర్స్ . ఇండియా వైడ్ గా ఓజీ ప్రీమియర్స్ గ్రాస్ ని ఈ చిత్రం బ్రేక్ చేయొచ్చేమో కానీ, వరల్డ్ వైడ్ గా బ్రేక్ చేయడం మాత్రం అసాధ్యమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ నుండి ఆ పాటని తొలగించిన మేకర్స్..పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం!

ఓజీ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 65 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు కేవలం ప్రీమియర్ షోస్ నుండి వచ్చాయి. ‘ధురంధర్ 2’ చిత్రానికి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ప్రీమియర్స్ నుండి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మొదటి రోజు ప్రీమియర్ షోస్ తో కలిపి ఈ చిత్రం నుండి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టాలని చూస్తున్నారట మేకర్స్. మరి ఆ రేంజ్ వసూళ్లు సాధ్యం అవుతుందా లేదా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper