Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Tweet On Ram Charan Dance: రామ్ చరణ్ డ్యాన్స్ చూసి పుత్రోత్సాహంతో మురిసిపోయిన...

Chiranjeevi Tweet On Ram Charan Dance: రామ్ చరణ్ డ్యాన్స్ చూసి పుత్రోత్సాహంతో మురిసిపోయిన చిరంజీవి.. ట్వీట్ వైరల్!

Chiranjeevi Tweet On Ram Charan Dance: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం వచ్చే నెల 30న ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా , ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలను శరవేగంగా చేస్తున్నారు. రీసెంట్ గానే ఈ చిత్రంలో రామ్ చరణ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. రెండు రోజుల క్రితమే ఆయన డబ్బింగ్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టేశాడు. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసి, చెప్పిన సమయానికి సినిమాని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన రెండవ పాట ‘రయ్ రయ్ రారా’ అనే పాట విడుదలైంది. సాధారణంగా నిన్న సాయంత్రం 7 గంటలకు విడుదల అవ్వాల్సిన ఈ పాట 10 గంటలకు విడుదలైంది. ముందుగా ఆడియో సాంగ్ వచ్చింది. అది వచ్చిన అరగంటకు వీడియో సాంగ్ కూడా వచ్చేసింది.

Also Read: కెమెరా, బ్యాటరీ పర్ఫామెన్స్ మెరుగ్గా ఉండాలంటే ఈ ఫోన్ కొనాల్సిందే..

ఈ పాటకు ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ, మొదటి పాట ‘చికిరి..చికిరి’ రేంజ్ రెస్పాన్స్ ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. మ్యూజిక్ అభిమానులు ఆశించినంత జోష్ గా లేదు. కానీ రామ్ చరణ్ తన అద్భుతమైన స్టెప్పులతో ఈ పాటని నిలబెట్టేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ లో రామ్ చరణ్ మరోసారి విజృభించేసాడు అనే చెప్పాలి. మెరుపు వేగంగా డ్యాన్స్ లు వేయడం అభిమానులకు బాగా నచ్చింది. అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ పాటని చూసి , తనలోని ఆనందాన్ని ఆపుకోలేక కాసేపటి క్రితమే ట్విట్టర్ లో వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. రామ్ చరణ్ విషయం లో మరోసారి ఆయనలోని పుత్రోత్సాహం ఈ ట్వీట్ లో కనిపించింది.

ఆయన మాట్లాడుతూ ‘పెద్ది సినిమాలోని ‘రయ్ రయ్ రారా’ పాటను చూడడం జరిగింది. రామ్ చరణ్ మరోసారి తన అద్భుతమైన ఎనర్జీ , గ్రేస్ తో డ్యాన్స్ దుమ్ములేపేశాడు. డైరెక్టర్ బుచ్చి బాబు మేకింగ్, AR రెహమాన్ సంగీతం , జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఈ సాంగ్ ని చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ‘చికిరి చికిరి’ పాట గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ సృష్టించిన స్పందించని మెగాస్టార్ చిరంజీవి , ఈ పాటకు ఇంత కనెక్ట్ అవుతాడని ఊహించలేదంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper