Chiranjeevi And Ram Charan Son: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అరడజన్ మంది మెగా ఫ్యామిలీ హీరోలు ఉన్నారంటే దాని వెనక చిరంజీవి ఉన్నాడు. కెరియర్ మొదట్లో చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొని ఇండస్ట్రీలో ఎవ్వరు తనకు సపోర్ట్ చేయకపోయిన కూడా ఒంటరిగా వచ్చి ఇండస్ట్రీలో తన జెండా పాతి మెగా ఫ్యామిలీ అనే ఒక ఎమోషన్ ను అభిమానుల్లో క్రియేట్ చేసిన వ్యక్తి చిరంజీవి…ఆయన తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి చాలామంది హీరోలు వచ్చారు. ఇలాంటి క్రమంలోనే తన కొడుకు రామ్ చరణ్ సైతం ప్రస్తుతం ‘గ్లోబల్ స్టార్’ గా అవతరించడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఆయనను మించిన హీరో మరొకరు లేరానంతలా గొప్ప గుర్తింపుని సంపాదించుకుంటున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించకపోయిన కూడా బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న ‘పెద్ది’ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని శాసించే స్థాయికి వెళ్తాడని చిరంజీవి సైతం గట్టి నమ్మకంతో ఉన్నాడు…
Also Read: వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘అల్లు సినిమాస్’..తెలుగు వాళ్లంటే అంత చులకనా?
ఇక ఈమధ్య రామ్ చరణ్ కి ఇద్దరు పిల్లలు(ట్విన్స్) పుట్టారు. ఇంతకుముందే క్లింకర అనే పాప ఉన్నప్పటికి ఇద్దరు ట్విన్స్ పుట్టడం పైన మెగా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే అభిమానులు సైతం చాలా ఆనందంగా ఉన్నారు… ఆ ఇద్దరిలో ఒక మగపిల్లాడు, ఒక ఆడపిల్ల పుట్టారు. రామ్ చరణ్ కి కొడుకు పుడితే కొండగట్టుకు వస్తానని చిరంజీవి మొక్కుకున్నాడట.
ఇక అందులో భాగంగానే చిరంజీవి కొండగట్టు దేవాలయాన్ని దర్శించుకోబోతున్నాడు అంట వార్తలైతే వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలకు ముందు కొండగట్టు నుంచి తన ప్రచారాన్ని కొనసాగించాడు. మెగా ఫ్యామిలీ మొత్తం కొండగట్టు దేవాలయాన్ని బాగా నమ్ముతున్నారు. మొదటి నుంచి కూడా చిరంజీవికి హనుమంతుడు అంటే చాలా ఇష్టం…
కాబట్టి ఇక కొండగట్టు దేవస్థానంలో ఉన్న హనుమంతుడు చాలా పవర్ఫుల్ దేవుడని పవన్ కళ్యాణ్ విషయంలో ప్రూవ్ అయింది… అందుకే చిరంజీవి సైతం కొండగట్టు ఆంజనేయుని మొక్కుకున్నాడట. రామ్ చరణ్ కి కొడుకు పుట్టాడు కాబట్టి ప్రస్తుతం ఆయన కొండగట్టు దేవాలయాన్ని దర్శించుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది… రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సైతం కొండగట్టు దేవస్థానం అభివృద్ధి నిమిత్తం కొన్ని డబ్బులైతే రిలీజ్ చేశారు…
