spot_img
Homeఎంటర్టైన్మెంట్Allu Sirish: పెళ్లి జరిగి వారం రోజులు అయ్యింది.. అప్పుడే పిల్లల విషయంలో అల్లు శిరీష్...

Allu Sirish: పెళ్లి జరిగి వారం రోజులు అయ్యింది.. అప్పుడే పిల్లల విషయంలో అల్లు శిరీష్ సంచలన నిర్ణయం!

Allu Sirish: రీసెంట్ గానే అల్లు అర్జున్(Icon Star Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish), నయనికా రెడ్డి పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో ప్రత్యేకిచ్చి చెప్పనవసరం లేదు. మెగా ఫ్యామిలీ హీరోలందరూ ఒక చోట కనిపిస్తే అభిమానులకు కనులపండుగ లాగా ఉంటుంది. పెళ్లి లో మెగా హీరోలతో పాటు, టాలీవుడ్ కి చెందిన కొనమంది ప్రముఖులు , సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పలువురు రాజకీయ నాయకులూ కూడా హాజరయ్యారు. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇది కాసేపు పక్కన పెడితే రీసెంట్ గానే అల్లు శిరీష్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన నయనికా తో ప్రేమ గురించి , అది పెళ్లి వరకు ఎలా వచ్చింది అనే దాని గురించి ఆయన ఈ ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

Also Read: వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘అల్లు సినిమాస్’..తెలుగు వాళ్లంటే అంత చులకనా?

ఆయన మాట్లాడుతూ ‘మా ప్రేమ వ్యవహారం ఇంట్లో అందరికంటే మా అత్తమ్మ (సురేఖ గారు) కి తెలిసింది. ఒకరోజు నేను , నయనికా కాఫీ షాప్ లో కూర్చొని ఉన్నాం. ఆ కాఫీ షాప్ కి సంబంధించిన ఓనర్లు మా అత్తమ్మ కి బాగా తెలుసు . ఆమెకు ఫోన్ చేసి చెప్పారు. మా అత్తమ్మ ద్వారా ఇంట్లో అందరికీ తెలిసింది. ఇక ఆ తర్వాత నేను , నయనికా కూడా ఇంట్లో ఓపెన్ అవ్వాల్సి వచ్చింది. అందరూ మా పెళ్ళికి ఒప్పుకున్నారు ‘అంటూ చెప్పుకొచ్చాడు అల్లు శిరీష్. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మేము రిలేషన్ లో ఉన్నప్పడే పిల్లల విషయం లో ఒక నిర్ణయం తీసుకున్నాం. మా పిల్లలకు పూర్తిగా తెలుగు లోనే మాట్లాడించాలని అనుకుంటున్నాము. మా అన్నా వదిన కూడా అదే చేయించారు ‘ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక నయనికా లో తనకు నచ్చే విషయాల గురించి చెప్తూ ‘నయనికా లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ పీక్ రేంజ్ లో ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం. అంతే కాకుండా మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలా మాట్లాడే టైపు కాదు నయనికా. ఏదైనా మనసులో ఉంటే ముఖం మీదనే చెప్పేస్తాది. నా సినిమాలు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పేస్తుంది, విమర్శలు కూడా చేస్తుంది ‘ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అల్లు శిరీష్ సినిమాల విషయానికి వస్తే , ఆయన చివరి సారిగా వెండితెర పై కనిపించిన చిత్రం ‘బడ్డీ’. ఈ సినిమా తర్వాత ఆయన మళ్లీ కొత్త ప్రాజెక్ట్ ని ఒప్పుకోలేదు. ప్రస్తుతానికి ఆయన ఆహా మీడియా, అల్లు సినిమాస్, అల్లు స్టూడియోస్ , AA సినిమా వ్యాపార లావాదేవీలను అల్లు శిరీష్ స్వయంగా చూసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular