Chiranjeevi Srikanth Odela Movie Villains: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధించిన వాళ్లలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ఇప్పటికి ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అలాంటి చిరంజీవి ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో సైతం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన బాబీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
Also Read: రాజ్యసభ పదవులకు పోటీ.. తెరపైకి కొత్త లెక్కలు!
ఇక యావత్ ఇండియన్స్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోగలిగే కెపాసిటి ఉన్న చిరంజీవి కేవలం తెలుగు సినిమాల కు మాత్రమే పరిమితమవుతున్నాడు. శ్రీకాంత్ ఓదెలతో చేయబోయే సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తారట. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు.
ఇక ఈ సినిమా ఆగస్టు 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన చిరంజీవి సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఇద్దరు విలన్స్ క్యారెక్టర్లు ఉన్నాయట. ఆ విలన్స్ క్యారెక్టర్ల కోసం మోహన్ బాబు రాజశేఖర్లను తీసుకోవాలని శ్రీకాంత్ అనుకుంటున్నాడట. ఈ విషయాన్ని చిరంజీవితో కూడా చెప్పాడట. దానికి చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ప్యారడైజ్ సినిమాలో మోహన్ బాబు విలన్ గా నటిస్తున్నాడు.
కాబట్టి అక్కడ మోహన్ బాబు తో శ్రీకాంత్ కి మంచి పరిచయం ఏర్పడింది. అందుకే చిరంజీవి సినిమాలో కూడా అతన్ని భాగం చేయాలని చూస్తున్నారట. రాజశేఖర్ ఇమేజ్ కి తగ్గట్టుగానే ఒక అద్భుతమైన పాత్రను కూడా మలిచారట. మరి ఆ పాత్ర కి తను తప్ప వేరే వాళ్ళు సెట్ అవ్వరనే ఉద్దేశ్యంతో అతని సెలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది…