Homeఎంటర్టైన్మెంట్Maa Inti Bangaram Twitter Talk: సమంత 'మా ఇంటి బంగారం' ట్విట్టర్ టాక్ ఇదే.....

Maa Inti Bangaram Twitter Talk: సమంత ‘మా ఇంటి బంగారం’ ట్విట్టర్ టాక్ ఇదే.. ఈ రేంజ్ లో చెప్తున్నారేంటి..

Maa Inti Bangaram Twitter Talk: సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు సమంత చేసిన ప్రొమోషన్స్ ఎలాంటివో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఏ టీవీ ఛానల్ చూసినా సమంత నే కనిపించేది. సోషల్ మీడియా లో కూడా ఎక్కడ చూసిన సమంత ఇంటర్వూస్ మాత్రమే కనిపించేవి. ఆ రేంజ్ లో ప్రమోట్ చేసి , జనాలకు […]

Maa Inti Bangaram Twitter Talk: సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు సమంత చేసిన ప్రొమోషన్స్ ఎలాంటివో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఏ టీవీ ఛానల్ చూసినా సమంత నే కనిపించేది. సోషల్ మీడియా లో కూడా ఎక్కడ చూసిన సమంత ఇంటర్వూస్ మాత్రమే కనిపించేవి. ఆ రేంజ్ లో ప్రమోట్ చేసి , జనాలకు ఈ సినిమాని దగ్గర చేయడంలో సమంత సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషనల్ కంటెంట్ కూడా పేలడంతో , అడ్వాన్స్ బుకింగ్స్ వరల్డ్ వైడ్ గా చాలా బలంగా జరిగింది. మరి ఇంతటి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఆడియన్స్ అంచనాలను అందుకుండా లేదా?, అసలు ఈ చిత్రాన్ని చూసిన ట్విట్టర్ జనాలు ఏమనుకుంటున్నారు అనేది ఈ రివ్యూ లో చూద్దాం.

తన కుటుంబం కోసం ఏదైనా చేయడానికి , ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్దపడే ఒక డేరింగ్ మహిళా కథ ఇది. ఫస్ట్ హాఫ్ మొత్తం కుటుంబ విలువలతో, సమంత మార్క్ హ్యూమర్ తో మంచి టైం పాస్ గా సాగిపోతూ ఉంటుంది అట. ఇక ప్రీ ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరకు డైరెక్టర్ నందిని రెడ్డి ఈ సినిమాని స్క్రీన్ ప్లే ని నడిపించిన విధానం అదిరిపోయిందని , రొటీన్ ఫార్మటు కి భిన్నంగా , సరికొత్త ఐడియాలతో , అదిరిపోయే సీక్వెన్స్ లతో థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ ని సర్ప్రైజ్ కి గురి చేసిందని అంటున్నారు. ప్రీ ఇంటర్వెల్ వరకు ఎంటర్టైనర్ గా సాగిపోయిన ఈ సినిమా , ప్రీ ఇంటర్వెల్ తర్వాత సీరియస్ డ్రామా జానర్ లోకి వెళ్లిందని , క్లైమాక్స్ వరకు కథ ఎక్కడా డీవియేట్ కాకుండా, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నందిని రెడ్డి స్క్రీన్ ప్లే ని నడిపించిన విధానం అద్భుతం అంటూ ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీకెండ్ కి మన కుటుంబ సభ్యులతో కలిసి , థియేటర్ లో కూర్చొని ఎంజాయ్ చేయదగ్గ కంటెంట్ ఈ చిత్రంలో ఉందని, ‘పెద్ది’ తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ , ఈ చిత్రం తో ఆ సక్సెస్ ట్రాక్ కొనసాగుతుందని అంటున్నారు. ‘ఓ బేబీ’ తర్వాత నందిని రెడ్డి , సమంత కాంబినేషన్ లో మరో సూపర్ హిట్ చిత్రం వచ్చిందని , విడుదలకు ముందే అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం , విడుదల తర్వాత, పైగా పాజిటివ్ టాక్ తో ఏ రేంజ్ వసూళ్లను రాబడుతుందో చూడాలి. ఇక ట్విట్టర్ లో ఈ చిత్రాన్ని చూసిన ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో కొన్ని ట్వీట్స్ మీకు క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper