spot_img
Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi In Rajasaab Teaser: 'రాజా సాబ్' టీజర్లో మెగాస్టార్ చిరంజీవి ని గమనించారా..? మీరు...

Chiranjeevi In Rajasaab Teaser: ‘రాజా సాబ్’ టీజర్లో మెగాస్టార్ చిరంజీవి ని గమనించారా..? మీరు గమనించని ఎన్నో విషయాలు ఉన్నాయి!

Chiranjeevi In Rajasaab Teaser:  ప్రభాస్(Rebel Star Prabhas) అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ‘రాజా సాబ్'(Raja Saab Teaser) టీజర్ నేడు విడుదలై ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ప్రభాస్ మొదటి నుండి ఒక మంచి ఎంటర్టైనర్. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ఆయన రేంజ్ ఎవ్వరూ అందుకోలేని స్థాయికి వెళ్లడంతో లోకల్ మాస్ మసాలా మూవీస్ కి బాగా దూరమయ్యాడు. ముఖ్యంగా ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ నటనని బయటపెట్టే ఒక్క సినిమా కూడా రాలేదు. అభిమానులు వింటేజ్ ప్రభాస్ ని మళ్ళీ చూడాలి అని కోరుకుంటున్న సమయంలో ఈ ‘రాజా సాబ్’ చిత్రాన్ని ప్రకటించారు. మొదట్లో అంచనాలు పెద్దగా ఉండేవి కాదు కానీ, సినిమాలోని కంటెంట్ ఒక్కొక్కటి బయట పడేలోపు అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది. ఇక నేడు విడుదలైన ‘రాజా సాబ్’ మూవీ టీజర్ లో ఎవ్వరూ గమనించని కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీకోసం అందిస్తున్నాము చూడండి.

Also Read :  Chiranjeevi: చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారా..?

టీజర్ ప్రారంభం లో సంజయ్ దత్(Sanjay Dutt) ‘ఈ ఇల్లు నా దేహం లాంటిది..ఈ సంపద నా ప్రాణం..నేను చనిపోయిన తర్వాత కూడా దీనిని నేను మాత్రమే అనుభవిస్తాను’ అంటూ చెప్పే డైలాగ్ తోనే మనకి ఈ సినిమా స్టోరీ ఏమిటి అనేది స్పష్టంగా అర్థమైపోయింది. ఇక ఆ తర్వాత వచ్చే VFX షాట్స్ అదిరిపోయాయి. మొసలి, అనకొండ పాము, దెయ్యం ఇలా ఎన్నో షాట్స్ ఫ్యాన్స్ ని , ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేసింది. ఆ స్పీడ్ గా టీజర్ వెళ్తున్న సమయం లో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చి ‘బండి కొంచెం మెల్లగా’ అని అంటాడు. ఆ తర్వాత సినిమాలోని కమర్షియల్ ఎలిమెంట్స్ చూపిస్తారు. ఒక షాట్ లో ప్రభాస్ టీ కొట్టు బయట కూర్చొని రౌడీ గ్యాంగ్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈ ఫైట్ లో ఆ టీ కొట్టు గోడ మీద మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth), అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) పోస్టర్లు ఉంటాయి.

ఈ చిత్ర డైరెక్టర్ మారుతీ మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమాని అనే సంగతి మన అందరికీ తెలిసిందే. తన ప్రతీ సినిమాలోనూ చిరంజీవి కి సంబంధించిన రిఫరెన్స్ సన్నివేశాలను పెడుతూ ఉంటాడు. అలా ఈ చిత్రం లో కూడా కాస్త స్పేస్ దొరకడం తో చిరంజీవి పోస్టర్ ని తగిలించేసాడు. అదే విధంగా ఈ టీజర్ లో బాగా గమనిస్తే ఇంటి లోపల కింద కొంతమంది ఉంటే, పైన కూడా కొంతమంది ఉంటారు. అలా ఒకే ఇంట్లో రెండు సమాంతరంగా ప్రపంచాలు నడుస్తూ ఉంటాయి. టీజర్ చివర్లో ప్రభాస్ ఇంటిని తగలబెడుతున్నప్పుడు కూడా చూస్తే రెండు ప్రపంచాలు కనిపిస్తాయి. ఇది చాలా ఆసక్తిని కలిగించే విషయం. అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఏమిటి అనేది అర్థం చేసుకోవడం ఇప్పట్లో కష్టమే. డిసెంబర్ 5 వరకు ఆగాల్సిందే.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Oktelugu Epaper