Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత 50 సంవత్సరాల నుంచి మకుటం లేని మహారాజుగా దూసుకుపోతున్న నటుడు చిరంజీవి(Chiranjeevi)… సినిమాలు చేసే విధానాన్ని, ప్రేక్షకులు సినిమా చూసే పద్ధతిని మార్చిన నటుడు కూడా తనే కావడం విశేషం… డ్యాన్సులతో, ఫైట్ల తో ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకున్నాడు. ఇక మాస్ హీరోగా అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా అవతరించి గత 50 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్లో విశ్వంభర (Vishvambhara)సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. జూన్ నెల నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూట్ కి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి భారీ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంలోనే అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ దర్శకుడు మొదటి నుంచి ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా కామెడీ జానర్ లోనే తెరకెక్కాయి. ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేవిధంగా కామెడీ సీన్స్ రాసుకొని యాక్షన్ ఎపిసోడ్స్ ని రంగరించి సినిమాలు చేయడంలో దిట్ట… మరి ఈయన ఇప్పుడు చిరంజీవి(Chirajeevi) తో చేయబోతున్న సినిమా కూడా ఇదే జానర్ లో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: ‘కూలీ’ టీజర్: రజినీకాంత్ విజిల్ సౌండ్ పాన్ ఇండియాలో వినిపిస్తుందా..?
చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను బయటికి తీసి ఆయనలోని యాక్షన్ ఎలిమెంట్స్ ని చూపించడానికి అనిల్ రావిపూడి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఇకమీదట రాబోయే సినిమాలతో కూడా మంచి విజయాలను సాధించి తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు.
ఇప్పటివరకు ఆయన చేసిన ఎనిమిది సినిమాలు సూపర్ సక్సెస్ లుగా నిలిచాయి. అందులో రీసెంట్ గా సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా వెంకటేష్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా దాదాపు 300 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలెవ్వరికి దక్కని ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకునేలా చేసింది.
మరి మొత్తానికైతే అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇద్దరిలో ఒకరు నయనతార కాగ, మరొకరు ఎవరు అనేదాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. మరి మరో హీరోయిన్ ని కూడా సీనియర్ హీరోయిన్ నే తీసుకుంటారా? లేదంటే యంగ్ హీరోలకి అవకాశం ఇస్తారా అనేది చూడాలి.