Pawan Kalyan range change: సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక రంగంలో రాణించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇక్కడ ఎదురయ్యే తీవ్రమైన పోటీని తట్టుకొని నిలబడగలగాలి అంటే గుండె ధైర్యం ఉండాలి. ఎన్ని రోజులైనా సరే అవకాశం కోసం వేచి చూడడానికి ఓపిక ఉండాలి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగే టాలెంట్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగే అవకాశాలైతే ఉంటాయి. అలా సమన్యుదిఅల్గ వచ్చి ఇండస్ట్రీ లో సత్తా చాటిన వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు…ఇక ఆయన తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం తన తెగింపుతో వరుస సక్సెస్ లను సాధించి యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని తన అభిమానులుగా మార్చుకున్నాడు. ప్రస్తుతం జనసేన పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా మారిపోయాడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలను కొనసాగిస్తూనే మరోవైపు సినిమాలను కూడా చేస్తున్నాడు. గత సంవత్సరం వచ్చిన ‘ఓజీ’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన పవన్ కళ్యాణ్ 400 కోట్లకు పైన కలెక్షన్స్ కొల్లగొట్టాడు. ఇక ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
ఇంతకుముందు చేసిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో భారీ డిజాస్టర్ ను మూట గట్టుకున్నాడు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించి తన తోటి దర్శకుల కంటే తను ముందువరుసలో ఉన్నానని నిరూపించుకోవాలని చూస్తున్నాడు.
ఇక హరీష్ శంకర్ గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమా మీదనే తన పూర్తి టైమ్ ను కేటాయిస్తున్నాడు… ఇక ఈ సినిమాతో అటు పవన్ కళ్యాణ్, ఇటు హరీష్ శంకర్ ఇద్దరి కెరియర్లు మారబోతున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే బ్యాక్ టు బ్యాక్ రెండు సక్సెస్ లను సాధించిన హీరోగా పేరు సంపాదించుకుంటాడు.
అలాగే హరీష్ శంకర్ ఈ సినిమాతో సత్తా చాటితే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో సినిమా చేసే అవకాశం కూడా దక్కుతుంది అంటూ సినిమా ఇండస్ట్రీలో కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి… ఇక మొత్తానికైతే ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని కట్టబెడుతుంది అనేది తెలియాలంటే మాత్రం మార్చి 26వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…