Ustaad Bhagat Singh: 12 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), రామ్ చరణ్ (Global Star Ram Charan) సినిమాలు నెల రోజుల గ్యాప్ తో విడుదల అవ్వబోయే సందర్భాన్ని ‘పెద్ది'(Peddi Movie), ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రాల ద్వారా చూడబోతున్నారు ఆడియన్స్. ముందుగా పెద్ది చిత్రాన్ని మార్చి 27 నా విడుదల చేద్దామని అనుకున్నారు మేకర్స్. కానీ షూటింగ్ చాలా వరకు పెండింగ్ ఉండడం తో ఏప్రిల్ 30 కి వాయిదా వేశారు. అదే విధంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని మార్చి 26 న విడుదల చేయబోతున్నారు. ఈ రెండు అప్డేట్స్ ని మేకర్స్ నిన్న సాయంత్రం ఒక గంట గ్యాప్ లో చెప్పారు. మెగా ఫ్యాన్స్ కి తమ అభిమాన హీరోల సినిమాలు నెల రోజుల గ్యాప్ లో విడుదల అవ్వబోతున్నాయి అని ఆనంద పడాలో, లేదా బాధ పడాలో అర్థం అవ్వని పరిస్థితి. ఎందుకంటే ఏ చిత్రానికి ఎక్కువ సంబరాలు చెయ్యాలి?, ఏ సినిమాని ఎక్కువ సార్లు చూడాలి అనే కన్ఫ్యూజన్ వారిలో ఉండిపోయింది.
అయితే అభిమానుల సంగతి కాసేపు పక్కన పెడితే ప్రస్తుతానికి ట్రేడ్ లో కానీ, సోషల్ మీడియా లో కానీ ‘పెద్ది’ చిత్రానికే ఎక్కువ హైప్ ఉందని నిన్నటితో తేలిపోయింది. విడుదల తేదీ ప్రకటించగానే ట్విట్టర్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి సంబంధించి ఏకంగా మూడు ట్యాగ్స్ టాప్ 10 లో ట్రెండ్ అయ్యాయి, ఇదొక సెన్సేషన్ అని చెప్పొచ్చు. కానీ ఆ తర్వాత ‘పెద్ది’ అప్డేట్ రాగానే, ఆ సినిమా హంగామా ఇంకా కాస్త ఎక్కువగా కనిపించింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి సంబంధించిన ట్యాగ్స్ మూడు గంటల తర్వాత డౌన్ అయ్యాయి, కానీ ‘పెద్ది’ ట్యాగ్ 5 గంటల వరకు ట్రెండ్ అయ్యింది. అయితే ‘పెద్ది’ ఒక అడుగు ముందు ఉండడానికి కారణం, అదొక పాన్ ఇండియన్ సినిమా కాబట్టే. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కేవలం ప్రాంతీయ బాషా చిత్రం మాత్రమే. అందుకే రీచ్ విషయం లో ఒక అడుగు ముందు ఉంది ‘పెద్ది’.
పైగా ‘పెద్ది’ నుండి విడుదలైన ‘చికిరి చికిరి’ పాట గ్లోబల్ వైడ్ గా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. చిన్నా పెద్ద అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఈ పాటకు చిందులేశారు. ఆ రీచ్ కూడా ఈ చిత్రానికి బాగా కలిసి వచ్చింది. కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. అందుకే ‘పెద్ది’ తో పోలిస్తే కాస్తా తక్కువ రీచ్ వచ్చింది. కానీ రాబోయే రోజుల్లో ఏదైనా జరగొచ్చు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి రెండు మూడు మంచి కంటెంట్స్ బయటకు వస్తే ‘పెద్ది’ హైప్ ని దాటే అవకాశాలు ఉన్నాయి. అయితే 2012 లో నెల రోజుల గ్యాప్ తో విడుదలైన ‘రచ్చ’, ‘గబ్బర్ సింగ్’ చిత్రాలు సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.