Homeఎంటర్టైన్మెంట్Brahmanandam Animal Spoof: బ్రహ్మానందం ‘యానిమల్’ గా ఎలా రెచ్చిపోయాడో చూడండి.. వైరల్ వీడియో

Brahmanandam Animal Spoof: బ్రహ్మానందం ‘యానిమల్’ గా ఎలా రెచ్చిపోయాడో చూడండి.. వైరల్ వీడియో

Brahmanandam Animal Spoof: టాలీవుడ్ సినిమాల బ్రహ్మనందం పేరు చెబితే చాలు.. కడుపుబ్బా నవ్వొస్తుంది. ఆయన ఏమాత్రం మాట్లాడకపోయినా ముఖ కవళికలతో నవ్వించగలడు. అందుకే దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు. ఒక దశలో బ్రహ్మానందం లేకపోతే కామెడీ లోటు తీవ్రంగా ఉండేదని కొందరు అనుకుంటారు. బ్రహ్మానందం తరువాత ఎందరో కమెడియన్లు ఇండస్ట్రీలోకి వచ్చినా.. ఆయనను బీట్ చేయలేకపోయారు. బ్రహ్మానందం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ రారాజుగా నిలుస్తున్నారు. ఆయన ఫొటోలు, వీడియోలతో మీమ్స్ చేస్తే అవి తప్పకుండా సక్సెస్ అవుతాయి. తాజాగా ‘యానిమల్’ మూవీకి సంబంధించి బ్రహ్మనందంతో మీమ్స్ తయారు చేశారు. అదిప్పుడు వైరల్ అవుతోంది.

రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ మూవీ డిసెంబర్ 1న థియేటర్లోకి వచ్చింది. అంతకుముందే ట్రైలర్ తో సెన్సెషనల్ సృష్టించిన ఈ మూవీ రిలీజ్ అయ్యాక అదే ఊపుతో జనాల్లోకి వెళ్లింది. భారీ యాక్షన్ మూవీగా గుర్తింపు పొందిన ఈ మూవీ ఫస్ట్ రోజే 116 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ కలెక్షన్ల విషయంలో తగ్గడం లేదు. మరోవైపు ఈ సినిమాలో రణబీర్ యాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక కొడుకు రౌడీగా ఎలా మారాడు? ఆ తరువాత ఏం జరిగింది? అనే పాత్రలో జీవించారనే చెప్పవచ్చు. అంతకుముందే బెస్ట్ యాక్టర్ అనిపించుకున్న రణబీర్ కపూర్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటారు.

యానిమల్ మూవీ రిలీజ్ అయిన తరువాత ఎన్నో మీమ్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తెలుగు నుంచి చాలా వచ్చాయి. కానీ బ్రహ్మానందంతో చేసిన ఈ మీమ్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. బ్రహ్మానందం ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో డిఫరెంట్ యాక్షన్ చేశారు. కానీ ప్రతీ యాక్షన్ లో ఆయన కామెడీ కనిపిస్తుంది. అలాంటి కొన్ని వీడియోలు సేకరించిన ఒకరు యానిమల్ మూవీలాగా మీమ్స్ ను తయారు చేశారు.

ఇందులో బ్రహ్మానందం రణబీర్ పాత్రలో కనిపిస్తూ ఆయన తండ్రి పాత్రలో నాజర్ ను చూపించారు. బ్రహ్మానందం,నాజర్ లు కలిసి బాద్ షా సినిమాలో కనిపించారు. ఈ సినిమాలో వీరిద్దరి యాక్షన్ హైలెట్ గా నిలుస్తుంది. దీంతో పాటు అతడులోనూ వీరు కలిసి కనిపిస్తారు. అలా కొన్ని వీడియోలను సేకరించి యానిమల్ మూవీని తయారు చేశారు. @telugubro అనే ఇన్ స్ట్రాగ్రామ్ లో ఉన్న ఈ వీడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. లైకులు, కామెంట్లు పెడుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper