spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8: ఈ వారం ఓటింగ్ లో నిఖిల్ ని దాటేసిన ప్రేరణ..డేంజర్...

Bigg Boss Telugu 8: ఈ వారం ఓటింగ్ లో నిఖిల్ ని దాటేసిన ప్రేరణ..డేంజర్ జోన్ ఇద్దరు ఊహించని కంటెస్టెంట్స్!

Bigg Boss Telugu 8: ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్లేందుకు ప్రేరణ, నిఖిల్, మెహబూబ్, నయనీ పావని, పృథ్వీ రాజ్, విష్ణు ప్రియ నామినేట్ అయ్యారు. ప్రతీ వారం హౌస్ మేట్స్ గ్రాఫ్స్ ట్రెండ్ మారుతూ రావడాన్ని ఇటీవల నెటిజెన్స్ గమనిస్తూనే ఉన్నారు. ఈ వారం కూడా అదే ట్రెండ్ కొనసాగుతూ ఉంది. అయితే హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఓటింగ్ గ్రాఫ్ ఎలా ఉన్నా, నిఖిల్, నభీల్ ఓటింగ్ గ్రాఫ్ మాత్రం ఒకేలా ఉండేది. నిఖిల్ కొంతకాలం మొదటి స్థానంలో, ఆ తర్వాత రెండవ స్థానంలో కొనసాగిన సందర్భాలు ఉన్నాయి. ఈ వారం ప్రస్తుతానికి ఆయన రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, ప్రేరణ నిఖిల్ ని అధిగమించి మొదటి స్థానంలో కొనసాగడమే. ఇది నిజంగా అందరినీ షాక్ కి గురి చేసే విషయం.

ఇద్దరి మధ్య ఓటింగ్ గ్యాప్ కూడా భారీగా పెరుగుతూ వెళ్తుంది. ఇక మూడవ స్థానంలో విష్ణు ప్రియ కొనసాగుతుంది, కానీ ఆమె నిన్నటి నామినేషన్స్ ఎపిసోడ్స్ లో పెట్టిన పాయింట్స్ చూస్తే ఆమెకి ఇంతకాలం ఓట్లు వేస్తూ వచ్చిన ఫ్యాన్స్ కూడా దండం పెట్టి ఓట్లు వేయడం ఆపే ప్రమాదం కూడా లేకపోలేదు. నాల్గవ స్థానం లో పృథ్వీ రాజ్ శెట్టి కొనసాగుతున్నాడు. ఈయన గత వారం అందరికంటే తక్కువ ఓట్లని సంపాదించిన కంటెస్టెంట్ గా నిలిచాడని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ఒక టాక్ నడిచింది. కానీ నాగార్జున గౌతమ్ ఎలిమినేట్ అయ్యినట్టుగా చూపించాడు. అయితే పృథ్వీ ప్రవర్తన ఈమధ్య హద్దులు దాటి ఎక్కడికో వెళ్ళిపోతుంది. నిన్న జరిగిన నామినేషన్స్ లో కూడా ఆయన రోహిణి ని బాడీ షేమింగ్ చేస్తూ కనిపించాడు. ఇదే యాటిట్యూడ్ తో కొనసాగితే మాత్రం పృథ్వీ ఎలిమినేట్ అవ్వక తప్పదు. ఇక ఐదవ స్థానంలో నయనీ పావని కొనసాగుతుండగా, ఆరవ స్థానంలో మెహబూబ్ కొనసాగుతున్నాడు. ఓటింగ్ గ్రాఫ్ ఈ వారం మొత్తం ఇలాగే ఉంటుంది అనే నమ్మకం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా మారిపోవచ్చు.

హౌస్ లో బలమైన ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్న కంటెస్టెంట్స్ నిఖిల్, నభీల్, ప్రేరణ మరియు యష్మీ మాత్రమే. మిగిలిన కంటెస్టెంట్స్ ఓటింగ్ గ్రాఫ్ గంటకి ఒకసారి మారే రేంజ్ లో ఉన్నాయి. వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో కేవలం గౌతమ్ కి ఒక్కటే టాప్ 5 లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మిగిలిన వారిలో ఆ అవకాశమే లేదు, భవిష్యత్తులో నామినేషన్స్ లోకి వైల్డ్ కార్డ్స్ వస్తే వాళ్ళే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారం నయనీ పావని, మెహబూబ్, వీళ్ళిద్దరూ కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. నయనీ పావని కి ప్రస్తుతం బాగా నెగటివిటీ ఉంది. ఈ వారం ఆమె టాస్కులు బాగా ఆడి కంటెంట్ ఇవ్వకపోతే ఆమెనే ఎలిమినేట్ అవ్వొచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Dhruv Vikram:

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Telangana ACB

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...
Ravi Prakash

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Narendra Modi Strategy

Narendra Modi Strategy: ఢిల్లీ కాక్రోచ్‌లపై మోదీ హిట్‌ వ్యూహం.. దెబ్బకు దిగొచ్చిన ఆందోళనకారులు!

Narendra Modi Strategy: నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో మొదలైన ఉద్యమం క్రమంగా దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. ఢిల్లీలో సీజేపీ నాయకత్వంలో సాగుతున్న ఈ ఆందోళనకు ఇతర రాష్ట్రాల్లో రాజకీయ...
SS Rajamouli

SS Rajamouli: వారణాసి బడ్జెట్ పెరగడం మీద స్పందించిన రాజమౌళి…

SS Rajamouli: మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. మొదట 1000 కోట్ల బడ్జెట్ తో తీసేద్దాం అనుకోని ఈ సినిమాని...
Oktelugu Epaper