spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8: గౌతమ్ కి మోకాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పిన అవినాష్..తారా...

Bigg Boss Telugu 8: గౌతమ్ కి మోకాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పిన అవినాష్..తారా స్థాయికి చేరిన గొడవలు!

Bigg Boss Telugu 8: నిన్న జరిగిన దసరా బిగ్ బాస్ స్పెషల్ ఎపిసోడ్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది అనే చెప్పాలి. ఇంతకు ముందు సీజన్స్ లో దసరా ఎపిసోడ్స్ చాలా బాగుండేవి, హైపర్ ఆది వంటి వారు వచ్చి హౌస్ మేట్స్ తో సరదాగా మాట్లాడుతూ ఫన్ చేసేవాళ్ళు, కానీ ఈ సీజన్ లో మాత్రం దసరా ఎపిసోడ్ బోర్ కొట్టేసింది అనే చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే నేటి నామినేషన్స్ ఎపిసోడ్ చాలా ఫైర్ మీద ఉంటుందని నిన్నటి ఎపిసోడ్ చివర్లో చూసినప్పుడు అందరికీ అర్థం అయ్యి ఉంటుంది. అవినాష్ కి, గౌతమ్ కి మధ్య పెద్ద ఫైట్ జరిగింది. అయితే ఈసారి నామినేషన్స్ ఎపిసోడ్ ని చాలా కొత్తగా ప్లాన్ చేసాడు బిగ్ బాస్. ఈ నామినేషన్స్ లో ఇద్దరు కిల్లర్స్ ఉంటారు. ఓజీ క్లాన్ నుండి ప్రేరణ, రాయల్ క్లాన్ నుండి హరితేజ ని కిల్లర్స్ గా ఎంచుకుంటాడు బిగ్ బాస్.

గార్డెన్ ఏరియా లో రెండు గుర్రాలు మరియు రెండు పింక్ ప్యాడ్స్ ఉంటాయి. పక్కనే ఉన్న ఒక స్టాండ్ మీద టోపీ ఉంటుంది. గుర్రం శబ్దం వినిపించినప్పుడు కిల్లర్స్ ఇద్దరిలో ఎవరైతే ముందుగా పరుగులు తీసి టోపీ ని అందుకుంటారో, వాళ్లకు నామినేషన్ చేసే ఛాన్స్ దక్కుతుంది. ఈ నామినేషన్స్ ప్రక్రియ నిన్న మధ్యాహ్నం నుండి రాత్రి వరకు కొనసాగింది. ఈ ప్రక్రియ లో ముందుగా రోహిణి గౌతమ్ ని నామినేట్ చేస్తుంది. అవినాష్ గత వారం లో గౌతమ్ ని ‘అశ్వథామ 2.0’ అని పిలవడం నచ్చకపోవడం తో గౌతమ్ గొడవపెట్టుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఎందుకు గొడవ పెట్టుకోవాల్సి వచ్చిందో కూడా పూర్తిగా వివరించాడు, అందులో అతని తప్పేమి లేదని కూడా అందరికీ అర్థమైంది. కానీ రోహిణి ఆ పాయింట్ మీద గౌతమ్ ని నామినేట్ చేయడం పెద్ద తప్పిదం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె మాట్లాడుతూ ‘గౌతమ్ అంటే ఎవరో బిగ్ బాస్ షో కి వచ్చే వరకు మాకెవ్వరికి తెలియదు’ అని అంటుంది. అప్పుడు గౌతమ్ ‘ఇది కామెడీ షో కాదు, ఇక్కడికి మనం వచ్చింది బిగ్ బాస్ షో ఆడదానికి’ అని అంటాడు.

దీనికి అవినాష్ ఒక రేంజ్ లో రెచ్చిపోతాడు. ఒక మనిషికి నచ్చని విషయాన్నీ మళ్ళీ మళ్ళీ గెలికి కామెడీ చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది అని అంటాడు గౌతమ్. అప్పుడు అవినాష్ ఆవేశంతో ‘నాకు తెలియదు..నాకు తెలియదు’ అని గట్టిగా అరుస్తాడు. ఇక నుండి ఎవ్వరూ కూడా గౌతమ్ ని ‘అశ్వథామ 2.0’ అని పిలవొద్దు,నిన్ను అలా పిలిచినందుకు దయచేసి నన్ను క్షమించు అని అవినాష్ మోకాళ్ళ మీద కూర్చిని గౌతమ్ కి క్షమాపణలు చెప్తాడు. ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అవినాష్ కి ఈ ప్రోమో చూసినప్పుడు ఆడియన్స్ కి అనిపించింది. అయితే వీరిలో ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు అనేది ఎపిసోడ్ పూర్తిగా చూసిన తర్వాతే తెలుస్తుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
Oktelugu Epaper