spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 9 Rithu Chowdary: 13 వారాలకు రీతూ చౌదరి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో...

Bigg Boss 9 Rithu Chowdary: 13 వారాలకు రీతూ చౌదరి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? హీరోయిన్స్ కి కూడా ఇంత ఇవ్వరు!

Bigg Boss 9 Rithu Chowdary: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో భారీ నెగిటివిటీ తో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో రీతూ చౌదరి ఒకరు. మొదటి మూడు వారాలు ఈమె నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ అయిపోతాది అనే రేంజ్ కంటెస్టెంట్, చాలా తక్కువ ఓటింగ్ ఉండేది. దానికి తోడు డిమోన్ పవన్ తో ప్రేమాయణం నడపడం కూడా ఆడియన్స్ కి అసలు నచ్చలేదు. ఫైర్ స్ట్రోమ్స్ గా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ కారణంగా ఈమె సేవ్ అయ్యింది. ఆరోజు ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం రీతూ చౌదరి ఎలిమినేట్ అవ్వాలి. కానీ ఆమెకు బదులుగా శ్రీజా ని అన్యాయంగా ఎలిమినేట్ చేశారు. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఇదొక మాయని మచ్చ లాంటిది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తనకు వచ్చిన గోల్డెన్ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ రీతూ చౌదరి తన గేమ్ ని బాగా మెరుగుపరుచుకుంది.

ఫలితంగా ఆమెకు కొద్దీ వారాలు డీసెంట్ ఓటింగ్ పడుతూ వచ్చేది. అయితే ఈమె నామినేషన్స్ కూడా ఒక స్ట్రాటజీ ప్రకారం గా ఎవరిని నామినేషన్స్ లోకి తీసుకొస్తే తానూ సేవ్ అవుతుందని బావిస్తుందో, వాళ్ళను నామినేషన్ లోకి తీసుకొస్తుంది. అంటే ప్రతీ వారం ఎలిమినేషన్ రౌండ్ లో ఉంటూ సేవ్ అయ్యే కంటెస్టెంట్ ని ఈమె నామినేషన్స్ లోకి తీసుకొచ్చేది. అలా వైల్డ్ కార్డ్స్ అందరినీ తనకు రక్షణ కవచం లాగా మార్చుకొని నామినేషన్స్ లోకి తీసుకొస్తూ అందరినీ ఇంటికి పంపేసింది. అలా ఒక్కసారి సంజన డేంజర్ జోన్ లోకి రావడం, ఎలాగో ఈమెకు తక్కువ ఓటింగ్ పడుతుంది కాబట్టి, ఆమెని నామినేట్ చేస్తూ వచ్చేది. దీంతో చిర్రెత్తిపోయిన సంజన రీతూ చౌదరి డిమోన్ పవన్ తో చేసే పనులను జనాలకు అర్థం అయ్యేలా, చాలా బోల్డ్ గా చెప్పడం మొదలు పెట్టింది.

సంజన చెప్పిన మాటలను ఫ్యామిలి ఆడియన్స్ కూడా సమర్దించారు, హౌస్ వీళ్లిద్దరు చేస్తున్నది అనే కదా ఫిక్స్ అయిపోయారు. ఇక అప్పటి నుండి రీతూ చౌదరి గ్రాఫ్ భారీగా పడిపోయింది , ఇప్పుడు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అయితే 13 వారాలు ఆమె హౌస్ లో కొనసాగినందుకు బిగ్ బాస్ టీం డబ్బులు ఈమెకు భారీగానే ఇచ్చింది. వారానికి రెండు లక్షల చొప్పున 13 వారాలకు గాను ఆమె 26 లక్షల రూపాయిలను రెమ్యూనరేషన్ గా అందుకుంది. అయితే ఒక్కటైతే నిజం, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ముందు ఈమెకు ఎలాంటి నెగిటివిటీ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ బిగ్ బాస్ షో ద్వారా ఎంతో కొత్త నెగిటివిటీ ని ఆమె పోగొట్టుకుందనే చెప్పాలి. చూడాలి మరి భవిష్యత్తులో ఈమె ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Venkatesh Kalyan Ram Movie

Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి కి తెలియకుండా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ఎంజాయ్ చేస్తున్నారుగా…

Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను చేస్తూ...
Bigg Boss Telugu

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ పై జబర్దస్త్ బ్యూటీ హాట్ కామెంట్స్.. ఈ...

Bigg Boss 10 Telugu: సెప్టెంబర్ 6 న ఇండియా వైడ్ గా అన్ని భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్...
Nagarjuna

Nagarjuna: నాగార్జున కొడుకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడా…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాళ్ళలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మైమరపింపజేసిన ఆయన ఇతర ఇండస్ట్రీలో నుంచి ఎదురయ్యే...
Abhishek Sharma

Abhishek Sharma: టీమిండియా వర్సెస్ జింబాబ్వే: అరుదైన ఘనతకు చేరువలో అభిషేక్ శర్మ..

Abhishek Sharma: పొట్టి క్రికెట్ ఫార్మాట్లో టీమ్ ఇండియాకు తిరుగులేని ఆయుధం లాంటి ఆటగాడు అభిషేక్ శర్మ. అతడికి ఫామ్ తో సంబంధం ఉండదు. బౌలర్ ఎవరనేది లెక్క ఉండదు. మైదానం...
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: ఆ 15 ఏళ్ల బుడ్డోడు బ్యాటర్ కాదు డైనమైట్.. టీమిండియా బౌలింగ్ దిగ్గజం షాకింగ్ కామెంట్స్

Vaibhav Suryavanshi: హర్భజన్ సింగ్.. టీమ్ ఇండియాలో లెజెండరీ స్పిన్ బౌలర్. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే న్యూజిలాండ్ వరకు ప్రతి జట్టు మీద అతడికి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అతడు గూగ్లీ...
Oktelugu Epaper