Bigg Boss 9 Telugu Double Elimination: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో ఊహించని సంఘటనలు ప్రతీ వారం జరుగుతూనే ఉన్నాయి. గత వారం దివ్య ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ తనూజ తో ఆమె కొట్లాడిన విధానం చూసి, ఇక మీదట కూడా ఆమెతో ఇదే తరహా కొట్లాటలు పెట్టుకుంటుంది, టీఆర్ఫీ రేటింగ్స్ బద్దలు అయిపోతాయని భావించి ఇమ్మానుయేల్ వద్ద ఉన్న పవర్ అస్త్రా తో ఎలిమినేషన్ ని రద్దు చేశారు. కానీ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. కానీ ఈ ఎలిమినేషన్ ఒక ఓటింగ్ ద్వారా తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ని తొలగించే ఆలోచన లో ఉండగా, మరొకటి రెడ్ కార్డ్ ఎలిమినేషన్ ద్వారా ఒకరిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారట. ప్రస్తుతం దీని గురించి బిగ్ బాస్ టీం మీటింగ్ పెట్టుకున్నారట. కాసేపట్లో రెడ్ కార్డ్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనేది స్పష్టం గా తెలియబోతుంది.
ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ లో జరిగిన గొడవలు ఎలాంటివో మనమంతా చూసాము. ఈ ప్రక్రియ లో సంజన రీతూ చౌదరి పై అత్యంత దారుణమైన కామెంట్స్ చేసింది, అదే విధంగా పవన్ కళ్యాణ్ రీతూ చౌదరి ని కొట్టేందుకు మీదకు దూసుకెళ్లాడు, ఆ తర్వాత కుర్చీని మూడు సార్లు కాళ్లతో తన్నాడు. అంతే కాకుండా రీతూ చౌదరి ని ఎదో అనరాని మాట అన్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. దివ్య కూడా ఆ సమయం లో ఒక ఎక్స్ ప్రెషన్ ఇస్తుంది. ఇక మూడవది డిమోన్ పవన్ పొరపాటున పవన్ కళ్యాణ్ గొంతు పట్టుకోవడం. ఇప్పటి వరకు బిగ్ బాస్ హిస్టరీ లో ఈ రేంజ్ ఫిజికల్ అవ్వడం ఎప్పుడూ జరగలేదు. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, పవన్ కళ్యాణ్ ని ఆపే ప్రయత్నం లో ఎదో తెలియకుండా అలా వచ్చేసింది.
ఈ ముగ్గురిలో ఒకరికి రెడ్ కార్డ్, ఇద్దరికీ ఎల్లో కార్డ్ ఇవ్వాలని బిగ్ బాస్ టీం బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయిందట. డిమోన్ పవన్ కి రెడ్ కార్డ్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. దానికి తోడు ఆయనకు ఓటింగ్ కూడా అనుకున్నంత రేంజ్ లో పడడం లేదు. ఈ వారం నామినేషన్స్ లోకి 8 మంది వచ్చారు. ఈ 8 మందిలో తనూజ, పవన్ కళ్యాణ్, ఇమ్మానుయేల్ తప్ప, మిగిలిన 5 మంది డేంజర్ జోన్ లోనే ఉన్నారట. చాలా తక్కువ శాతం తేడా ఓటింగ్ ఉందట. కాబట్టి వీరిలో ఎవరైనా ఎలిమినేట్ అయిపోవచ్చు. అందరికంటే తక్కువ ఓటింగ్ తో దివ్య కొనసాగుతోంది, కాబట్టి ఆడియన్స్ ఓటింగ్ ద్వారా తక్కువ ఓట్లు వచ్చిన దివ్య ని, రెడ్ కార్డ్ ద్వారా డిమోన్ పవన్ ని ఎలిమినేట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.