Most terrifying places in the world: ఈ ప్రపంచం లో ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. అలాగే అందమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. గతంలో కంటే ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్న ప్రదేశాల గురించి వెలుగులోకి వస్తున్నాయి. వీటిని చూడడానికి ఎంతటి కష్టాన్నయినా ఎదుర్కొని ముందుకు వెళ్తున్నారు. అక్కడి అందమైన ప్రదేశాలను చూస్తూ ఆహ్లాదంగా గడుపుతున్నారు. పదిరోజులు ఎంతో ఒత్తిడితో ఉండే ఇలాంటి ప్రదేశాలకు వెళ్తే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇదే సమయంలో కొన్ని ప్రదేశాలు చూడడానికి ఎంతో బాగుంటాయి. కానీ ఇక్కడికి వెళ్లడం వల్ల ప్రమాదమే ఉంటుంది. ఈ ప్రదేశంలోని గాలిని పిలిచినా కూడా మరణమే అన్నట్లు ఉంటుంది. అలాంటి అత్యంత భయంకరమైన ప్రదేశాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
మనకు ఒక పాములు చూస్తేనే వణుకు పుడుతుంది. అలాంటిది ఒక చదరపు మీటర్ కు పదుల కొద్దిపాములు ఉన్నాయంటే ఎవరైనా భయపడకుండా ఉంటారా? బ్రెజిల్ లోని స్నేక్ ఐలాండ్ అనే దీవిలో ఇలా ప్రతి చోట పాములు కనిపిస్తూనే ఉంటాయి. దీంతో ఇక్కడికి వెళ్లడానికి ప్రభుత్వం నిషేధాన్ని ప్రకటించింది. అయితే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఇక్కడికి వెళ్లి పరిశోధనలు చేసే ప్రయత్నం చేశారు. అత్యంత అరుదైన పాములతో పాటు ప్రమాదకరమైన పాములు ఈ ప్రదేశంలో ఉంటాయి.
మనకు ఏదైనా సరస్సులు చూడగానే అక్కడ ఒక రోజంతా గడపాలని అనుకుంటాం. ఆ సరస్సు వద్ద ఉండే పక్షులను చూసి ఎంతో ఎంజాయ్ చేస్తాం. కానీ ఉత్తర టాంజానియా లో ఉన్న నట్రోన్ అనే సరస్సు ప్రపంచంలోనే అత్యంత భయంకరమైనదిగా పేర్కొనబడుతోంది. ఈ సరస్సులో ఉండే నీళ్లు ఉప్పు, క్లారత్వాన్ని అత్యధికంగా కలిగి ఉంటుంది. ఈ నీరు చర్మంపై పడితే కాలిపోతుంది. కళ్ళు తీవ్రంగా మండుతాయి. ఇక్కడ తీవ్రంగా ఉష్ణోగ్రత ఉండడంతో సరస్సు పై నుంచి వచ్చే గాలి కూడా ప్రమాదకరంగానే ఉంటుంది.
భారత్ లోను భయంకరమైన ప్రదేశం ఉందంటే ఎవరైనా నమ్మరు. భారత్కు సమీపాన ఉన్న అండమాన్ నికోబార్ దీవుల్లో భాగమైన నార్త్ సెంటిలైన్ ఐలాండ్ డేంజర్ ప్రదేశంగా పేర్కొంటారు. ఇక్కడికి వెళ్లినవారు తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ దీవుల్లో ప్రత్యేకమైన తెగకు చెందిన ప్రజలు ఉంటారు. వీరు బయట ప్రపంచంతో సంబంధాలను తెగి ఉన్నారు. ఇక్కడికి ఎవరు వచ్చినా వారిని బాణాలతో చంపేస్తూ ఉంటారు. అందుకే ఈ ప్రదేశాన్ని భారత్ నిషేధం ప్రకటించింది.
వేసవికాలంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతకు తట్టుకోలేక పోతుంటాం. కానీ ఇథియోపియో లోని డానా కిల్ డిప్రెషన్ అనే ప్రదేశం అత్యంత వేడిగా ఉంటుంది. ఇక్కడి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ వరకు కొనసాగుతుంది. అగ్నిపర్వతాలు పేలుతూ ఉంటాయి. దీంతో ఇక్కడ ఉష వాయువులు, రంగురంగుల యాసిడ్స్ కనిపిస్తాయి. ఈ ప్రదేశంలో గాలి కూడా ప్రమాదకరంగానే ఉంటుంది.
దక్షిణ అంగుళాల నుంచి ఉత్తర నమిబియా వరకు ఉన్న తీర ప్రాంతంలో నమీబియా అనే దేశంలో స్కెలిటన్ కోస్ట్ అనే ప్రదేశం అత్యంత వేడిగా ఉంటుంది.. ఇక్కడ తిమింగలాలు, ఏనుగుల కళేబరాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రదేశంలో ఎక్కువగా సింహాలు, హైనా లు తిరుగుతూ ఉంటాయి. పొరపాటున ఇక్కడికి ఎవరు వచ్చినా వాటిని చంపకు తింటాయి.